ETV Bharat / state

Mister Andhra 32 చోరీలకు పాల్పడిన బాడీ బిల్డర్ మిస్టర్ ఆంధ్రా.. ఆ కారణంతోనే..

Body Builder Committed Thefts: బాడీ బిల్డింగ్ పోటీల్లో గెలిచి మిస్టర్ ఆంధ్రా టైటిల్​ను గెలుచుకున్న ఓ యువకుడు సులువుగా డబ్బు సంపాదించుకునేందుకు పదుల సంఖ్యలో దొంగతనాలకు పాల్పడ్డాడు. ఆంధ్రాతో పాటు బెంగళూరులో పలు చోరీలకు పాల్పడిన బాడీ బిల్డర్​తో సహా మరో ఇద్దరు నిందితులను గిరినగర్ పోలీసులు అరెస్టు చేశారు.

Body Builder Committed Thefts
చోరీలకు పాల్పడిన బాడీ బిల్డర్ మిస్టర్ ఆంధ్రా
author img

By

Published : Apr 25, 2023, 2:56 PM IST

Updated : Apr 25, 2023, 3:12 PM IST

Body Builder Committed Thefts: అతడో బాడీ బిల్డర్.. బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొని మిస్టర్ ఆంధ్రా అనే టైటిల్​ను కూడా గెలుచుకున్నాడు. అయితే అతడికి ఎక్కువగా కష్టపడకుండా.. సులువుగా డబ్బు సంపాదించాలి అనే అత్యాశ కలిగింది. అందుకోసం బెంగళూరుకు వెళ్లాడు.. అక్కడికి వెళ్లింది.. ఏదో ఉద్యోగం చేసుకోవటానికి అయితే కాదండోయ్​..! అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే.. దొంగతనాలు చేస్తే డబ్బును సులభంగా సంపాదించొచ్చని అనుకున్న అతడు అక్కడకు వెళ్లాడు. ఒంటరిగా వెళ్తున్న వృద్ధులు, మహిళలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడేవాడు. ఇలా ఇప్పటి వరకు 32 కేసుల్లో ఇతగాడి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. చిన్నపాటి సెలబ్రిటీగా పేరు మోసిన ఇతడిపై ఇన్ని కేసులు నమోదు కావడంతో.. పోలీసులు అవాక్కైయ్యారు. చివరికి పోలీసుల చేతికి చిక్కడంతో.. దొంగసొత్తు స్వాధీనంపై పోలీసులు దృష్టి పెట్టారు. వివరాల్లోకి వెళ్తే..

పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్​లోని కడపకు చెందిన నిందితుడు సయ్యద్ బాషా 2005 నుంచి 2015 వరకు కువైట్​లో కారు డ్రైవర్​గా పనిచేశాడు. ఈ సమయంలో విదేశాల్లో ఉంటూ గోల్డ్ స్మగ్లింగ్​కు పాల్పడేవాడనే ఆరోపణలు ఇతనిపై ఉన్నాయి. అయితే కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న సమయంలో బాషా తిరిగి ఇండియాకు వచ్చేశాడు. అదే సమయంలో శారీరక వ్యాయామంపై అతడు ఆసక్తిని పెంచుకున్నాడు. బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొని మిస్టర్ ఆంధ్ర అనే టైటిల్​ను కూడా సొంతం చేసుకున్నాడు. అయితే అతడు సులభంగా డబ్బు సంపాదించేందుకు భాషా నేరస్థులతో సంబంధాలను పెంచుకున్నాడు. ఆపై అతడు వరుసగా గొలుసు దొంగతానాలకు పాల్పడ్డాడు.

కాగా గతంలో కూడా నిందితుడు సయ్యద్ బాషాను కడపలో స్థానిక పోలీసులు దొంగతనం ఆరోపణలపై అరెస్టు చేశారు. అతడు జైల్లో ఉన్న సమయంలో బెంగళూరులో సులువుగా చోరీలకు పాల్పడవచ్చని ఓ ఖైదీ ద్వారా తెలుసుకున్నాడు. అనంతరం అతడు బెయిల్​పై బయటకు వచ్చి బెంగళూరుకు వెళ్లాడు. ఇక అప్పటి నుంచి బెంగళూరులో వరుస చోరీలకు పాల్పడ్డాడు.

భయంతో మొబైల్​ ఫోన్ వాడలేదు: బెంగళూరుకు వచ్చిన సయ్యద్​ ఒంటరిగా వెళ్లే వృద్ధులు, మహిళలను లక్ష్యంగా చేసుకుని కొంతమందితో కలిసి దోపిడీలకు పాల్పడేవాడు. స్థానిక ప్రాంతాల్లో తిరిగితే పోలీసులకు అనుమానం రాదని నిందితులు భావించారు. దీంతో వారు చోరీలకు పాల్పడిన అనంతరం బెంగళూరు వదిలి వెళ్లకుండా గిరినగర్ పోలీస్​ స్టేషన్ చుట్టూనే తిరుగుతూ ఉండేవారు. అయితే ఫోన్​ వాడితే పోలీసులకు సులభంగా దొరికిపోతామని అనుకున్న నిందితులు మొబైల్​ ఫోన్స్ వాడలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు తదుపరి చర్యలు చేపట్టారు.

ఇవీ చదవండి:

Last Updated : Apr 25, 2023, 3:12 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.