సీఏఏ, ఎన్ఆర్సీ చట్టాలపై అవగాహన కల్పించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి బండి ప్రభాకర్ అన్నారు. కడప పార్టీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. కేవలం దురుద్దేశంతోనే ఈ చట్టాలపై కొంతమంది లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ చట్టాల వల్ల ముస్లింలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పేందుకు తాము ఎక్కడికైనా వస్తామని.. నిరూపిస్తే రాజీనామా చేస్తామని ఆయన బహిరంగ సవాల్ విసిరారు. చట్టాలకు వ్యతిరేకంగా కడపలో ముస్లిం ఐకాస ఆధ్వర్యంలో లాంగ్ మార్చ్ నిర్వహించడం సరైంది కాదన్నారు. అవసరమైతే ఈ లాంగ్ మార్చ్‌లో తాము పాల్గొని చట్టాల గురించి ఎలాంటి నష్టం లేదని ముస్లింలకు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: