కరోనా నియంత్రణలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని.. భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. కొవిడ్ బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేస్తూ కడపలో భాజపా ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఇతర రాష్ట్రాలలో 60 సంవత్సరాలు దాటిన ముఖ్యమంత్రులు కూడా ఆస్పత్రికి వెళ్లి.. కరోనా రోగులను పరామర్శిస్తూ ఉంటే 50 సంవత్సరాలలోపు ఉన్న ముఖ్యమంత్రి జగన్ ఒక ఆసుపత్రిని పరిశీలించకపోవడం దారుణం అని అన్నారు.
కేవలం సమీక్షల ద్వారా కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వెంటిలేటర్లు వస్తే వాటిని ఉపయోగించుకోలేని దుస్థితిలో రాష్ట్రంలోని ఆసుపత్రులు ఉన్నాయని తెలిపారు. అన్ని రాష్ట్రాల్లో జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తిస్తూ ఉంటే ఒక్క ఆంధ్రప్రదేశ్ లో మాత్రం జగన్ మోహన్ రెడ్డి గుర్తించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఆనందయ్య వైద్యానికి ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండీ.. రాజమహేంద్రవరం జైలు నుంచి 21 మంది ఖైదీలు విడుదల