ETV Bharat / state

BJP RANABHERI : 'వైకాపా అరాచక పాలన ఎన్నాళ్లో సాగదు'

వెనుకబడిన రాయలసీమ సహా రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే... డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం రావాలని భాజపా నేతలు అన్నారు. సీమ ప్రాంతం నుంచే ఎక్కువ మంది ముఖ్యమంత్రులుగా ఎదిగినా... ఈ ప్రాంతానికి ఒరిగిందేమీ లేదని విమర్శించారు. రాయలసీమ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కావాలన్నా, వెనుకబాటుతనం రూపుమాపాలన్నా... భాజపాతోనే సాధ్యమన్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అప్పులు, అరాచకాలు తప్ప... చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు.

BJP RANABHERI
BJP RANABHERI
author img

By

Published : Mar 20, 2022, 5:28 AM IST

కడపలో నిర్వహించిన "రాయలసీమ రణభేరి" సభ ఉత్సాహంగా సాగింది. ఇటీవలి 4 రాష్ట్రాల ఎన్నికల్లో దక్కిన విజయోత్సాహంతో... ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా నుంచే భాజపా ఎన్నికల శంఖారావం పూరించింది. ఈ సభలో పాల్గొన్న భాజపా అగ్రనేతలంతా... జగన్‌ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాయలసీమ నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు... నేతల ప్రసంగాలకు కేరింతలు కొట్టారు.

'వైకాపా అరాచక పాలన ఎన్నాళ్లో సాగదు'

వైకాపా అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్నా... రాయలసీమకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఈ ప్రాంతం నుంచి అనేక మంది ముఖ్యమంత్రులుగా పనిచేసినా... వెనుకబాటుతనాన్ని రూపుమాపలేకపోయారని ఆక్షేపించారు. సాగునీటి ప్రాజెక్టుల పూర్తి కాకపోవడానికి, ఈ ప్రాంత వెనుకబాటుకు నేతల నిర్లక్ష్యమే కారణమన్నారు. ప్రభుత్వంపై పోరాడే భాజపా కార్యకర్తలపై అక్రమ కేసులు పెడితే సహించేది లేదని హెచ్చరించారు.

Vo3: నీతివంతమైన పాలన అందిస్తామని అధికారంలోకి వచ్చిన జగన్‌... అవినీతి చక్రవర్తిగా పేరు తెచ్చుకున్నారని ఎంపీ సి.ఎం.రమేశ్‌ ఆరోపించారు. సీమలో నేతలు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కంటే... ఖనిజ సంపద, భూదోపిడీకే అధిక ప్రాధాన్యం ఇచ్చారని కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. రాయలసీమ సహా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి బాధ్యత భాజపా తీసుకుంటుందని... వచ్చే ఎన్నికల్లో పార్టీకి అధికారం కట్టబెట్టాలని ప్రజల్ని కోరారు.

Vo4: రాష్ట్రంలో కశ్మీర్‌ లోయ తరహా పరిస్థితులు రాకూడదంటే వైకాపాను గద్దె దించి, భాజపాకు పగ్గాలు అందించాలని... ఆ పార్టీ రాష్ట్ర సహ ఇన్‌ఛార్జ్‌ సునీల్ దేవధర్‌ కోరారు.

ఇటీవల విడుదలైన "ది కశ్మీర్‌ ఫైల్స్‌" సినిమా చూసే ఉంటారు. 1989-92 మధ్య కశ్మీర్ లోయలో ఏం జరిగిందో చూపించారు. రాయలసీమ, ఆంధ్రప్రదేశ్‌లో అలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే... ఇక్కడి రెండు ప్రధాన పార్టీలను ఓడించాలి. రాష్ట్రంలో భాజపా, జనసేన కూటమే ప్రత్యామ్నాయం. రెండు పార్టీల కార్యకర్తలూ ఒక్కటవ్వాలి. భాజపా, జనసేన కూటమితోనే బంగారు ఆంధ్రప్రదేశ్‌ సాధన సాధ్యమవుతుంది. - సునీల్‌ దేవధర్‌, భాజపా రాష్ట్ర సహ ఇన్‌ఛార్జ్‌

కర్నూలు జిల్లాకు చెందిన బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డికి... వేదికపై మాట్లాడటానికి అవకాశం ఇవ్వకపోవడంతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుపై మండిపడ్డారు. జైరాయలసీమ అని నినాదాలు చేసుకుంటూ ఆగ్రహంతో వెళ్లిపోయారు.

ఇదీ చదవండి : నేటి నుంచి జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.