రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణరెడ్డి స్పష్టం చేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో మాట్లాడిన ఆయన.. కొవిడ్ నియంత్రణ కోసం కేంద్రం ఏపీకి రూ.8 వేల కోట్లు ప్రకటించిందన్నారు. కేంద్రం రాష్ట్రానికి ప్రకటించిన నిధులు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బయటకు చెప్పకపోవడం బాధాకరమన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనాతో చేరితే లక్షల రూపాయలు దండుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీ కార్డుతో ప్రైవేట్ ఆసుపత్రిలో కరోనా వైద్యం అందడం లేదని ఆరోపించారు.
ప్రొద్దుటూరులో ఇసుక దోపిడీ పెద్ద ఎత్తున జరుగుతోందని ఆదినారాయణరెడ్డి ఆరోపించారు. సీఎం జగన్ ద్వంద్వ విధానం మానుకోవాలని తెలిపారు. రాజధానిని మూడు ముక్కలు చేయడాన్ని భాజపా ఒప్పుకునే ప్రసక్తి లేదని ఆదినారాయణరెడ్డి తేల్చిచెప్పారు.
ఇదీ చదవండి : రాష్ట్రంలో కొత్తగా 7,956 కరోనా కేసులు, 60 మరణాలు