రైతుల మేలు కోసమే కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చిందని భాజపా కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శశిభూషణ్ రెడ్డి అన్నారు. కడప జిల్లా స్థానిక భాజపా నేతలతో సమావేశం నిర్వహించారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరెేకంగా వివిధ రాజకీయ పార్టీల నేతలు నిరసనలకు దిగటం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. దిల్లీలో ఆందోళనలు చేస్తున్న రైతులను మరింత రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం సరి కాదన్నారు. పండించిన పంటను ఎక్కడైనా అమ్ముకునే వెసులుబాటును ఈ చట్టాలు కల్పిస్తున్నాయని వివరించారు. రైతులు అర్థం చేసుకోవాలన్న ఆయన, రేపటి భారత్ బంద్ పిలుపును విరమించుకోవాలని సూచించారు.
ఇదీ చదవండి: