కడపలో భాజపా రాష్ట్ర కోర్ కమిటీ సమావేశం జరిగింది. సమావేశానికి భాజపా రాాష్ట్ర ప్రధాన కార్యదర్శ విష్ణువర్ధన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కోవాలని, అందుకు మంచి అభ్యర్థులను బరిలో దించాలని సూచించారు. జిల్లా నూతన కమిటీలో రిజర్వేషన్లకు ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి ఎప్పటికీ గుర్తింపు ఉంటుందని ఆయన తెలిపారు. ఎంపిక చేసిన జిల్లా జాబితాను రాష్ట్ర స్థాయి అధికారులకు అందజేస్తామన్నా ఆయన... 2024లో భాజపా అధికారంలోకి రావాలంటే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలోరాష్ట్ర ఉపాధ్యక్షులు ఆదినారాయణరెడ్డి, శశిభూషణ్ రెడ్డి హాజరయ్యారు.
ఇదీ చదవండి: పవన్‌తో సోము వీర్రాజు భేటీ..తిరుపతి ఎంపీ అభ్యర్థిపై చర్చ