LPG Cylinder Price Hike: ఓవైపు నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్న నేపథ్యంలో కేంద్రం వంట గ్యాస్ ధరలను పెచడంపై ప్రతి పక్షాలు స్పందించాయి. గ్యాస్ ధరల పెంపుకు క్రేంద్రం అనుసరిస్తున్న విధానాలే అంటూ.. ఆంధ్రప్రదేశ్ పీసీసీ మీడియా ఛైర్మెన్ తులసి రెడ్డి ఆరోపించారు. ధరలు పెంచడంతో సామాన్య ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గ్యాస్ సిలిండర్ను రూ.500కే సరఫరా చేస్తామని వెల్లడిచారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వంట గ్యాస్ సిలిండర్ పై రూ.50, వాణిజ్య సిలిండర్ పై రూ.350 లు పెంచడం అమానుషం దుర్మార్గం అని పీసీసీ మీడియా ఛైర్మెన్ తులసి రెడ్డి విమర్శించారు. కడప జిల్లా వేంపల్లి లో తులసి రెడ్డి మీడియా తో మాట్లాడారు. 2014 లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధర బ్యారెల్ కు 114 డాలర్లు ఉన్నప్పుడు ప్రజలకు వంట గ్యాస్ సిలిండర్ ను రూ. 410 లకు సరఫరా చేసినట్లు గుర్తు చేశారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర 90 డాలర్లే ఉన్నట్లు తులసి రెడ్డి గుర్తు చేశారు. అయినప్పటికీ... కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వంట గ్యాస్ సిలిండర్ ధరను దాదాపు రూ.1200 చేయడం శోచనీయమని అన్నారు. గృహిణులు వంట గదిలోకి వెళ్లాలంటే భయపడి పోతున్నారని తులసి రెడ్డి ఎద్దేవా చేశారు. మోడీ పాలనలో అచ్చే దిన్కు బదులు చచ్చే దినాలు దాపరించాయని తులసి రెడ్డి విమర్శించారు. సబ్ కా వికాస్ బదులు సబ్ కా వినాస్ జరుగుతుందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రూ.500 లకే వంట గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తుందని తులసి రెడ్డి తెలిపారు.
'కేంద్రంలో మోదీ ప్రభుత్వం వంట గ్యాస్ ధరను సిలిండర్ పై రూ.50, వాణిజ్య సిలిండర్ పై రూ.350 లు పెంచడం అమానుషం. గతంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో బ్యారెల్ కు 114 డాలర్లు ఉన్నప్పుడు ప్రజలకు వంట గ్యాస్ సిలిండర్ ను రూ. 410 లకు సరఫరా చేశారు. మోదీ మహిళల కంట కన్నీరు పెట్టిస్తున్నారు. వెంటనే పెంచిన ధరను తగ్గించాలి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత వంట గ్యాస్ ధరను రూ.500కు సరఫరా చేస్తామని మల్లికార్జున ఖర్గే గారు సైతం ఇదే విషయాన్ని తెలిపారు.'- తులసి రెడ్డి, పీసీసీ మీడియా ఛైర్మెన్ .
ఇవీ చదవండి: