పులివెందుల నియోజకవర్గంలో అకాల వర్ష బీభత్సం లాక్‌డౌన్‌తో ఇబ్బందిపడుతున్న రైతన్నపై ప్రకృతి కన్నెర్ర చేసింది. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో శుక్రవారం పెనుగాలులు, వడగళ్ల వాన సృష్టించిన బీభత్సానికి అరటిపంటలు నేలకొరిగాయి. దాదాపు 185 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. లాక్‌డౌన్ వల్ల రవాణా నిలిచి పంట అమ్ముకోలేక ఇబ్బంది పడుతుంటే... అకాల వర్షాలు తమకు నష్టాలు తెచ్చాయని రైతులు వాపోయారు. ఆర్థికంగా కుదేలవుతున్నామని ఆవేదన చెందారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు.ఇదీ చదవండి
రాష్ట్రంలో కొత్తగా 62 కరోనా పాజిటివ్ కేసులు