ETV Bharat / state

ధాన్యం కొనుగోలుపై కడప కలెక్టరేట్​లో అవగాహన - kadapa news today

ఖరీఫ్ ధాన్యం కొనుగోలుపై కడప జిల్లా కలెక్టరేట్​లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇన్​ఛార్జ్ కలెక్టర్ గౌతమి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తుందని ఆమె చెప్పారు.

awareness-program-on-purchase-of-grain-in-kadapa-collectorate
కడప కలెక్టరేట్​లో ధాన్యం కొనుగోలుపై అవగాహన కార్యక్రమం
author img

By

Published : Oct 12, 2020, 9:14 PM IST

ప్రభుత్వ మద్దతు ధర కంటే తక్కువగా రైతులు ధాన్యాన్ని అమ్ముకునే పరిస్థితి రాకూడదని కడప జిల్లా ఇన్​ఛార్జ్ కలెక్టర్ ఎం.గౌతమి అన్నారు. కలెక్టరేట్ సభా భవనంలో ఖరీఫ్ సీజన్​కు సంబంధించి, ధాన్యం కొనుగోలుపై అవగాహన కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ- కడప ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. రైతు వివరాల నమోదు, నాణ్యతా విశ్లేషణ, ధాన్యం కొనుగోళ్లపై.. సిబ్బందికి, గ్రామ వ్యవసాయ సహాయకులకు అవగాహన కల్పించారు.

ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది...

రైతులకు ప్రభుత్వమే గిట్టుబాటు ధర కల్పించి, వారికి లాభం చేకూర్చేలా ధాన్యాన్ని కొనుగోలు చేస్తోందని ఇంఛార్జ్ కలెక్టర్ గౌతమి అన్నారు. మొట్టమొదటి సారిగా రైతు భరోసా కేంద్రాల్లో ఖరీఫ్ పంటధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. ధాన్యం కొనుగోలు నిర్వహణ కోసం అన్ని రైతు భరోసా కేంద్రాల్లో సీఎం యాప్ నిర్వహణను చేపట్టాలన్నారు. ఈ- క్రాపింగ్ లో గుర్తింపు పొందిన రైతుల వివరాలను మాత్రమే ప్రోక్యుర్మెంట్ పోర్టల్ లో నమోదు చేయాలని సూచించారు. రైతులకు చెందిన భూమి వివరాలను నమోదు చేసే విషయాలో జాగ్రతలు పాటించాలని అన్నారు.

ఇదీచదవండి.

'సినిమా వందో రోజైనా టికెట్టు దొరకలేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.