కడప జిల్లా రైల్వే కోడూర్ మండలంలో గత రెండు రోజులుగా పలు ప్రాంతాలలో నాటు సారా తయారీ కేంద్రాలపై ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు దాడులు నిర్వహించారు. చిట్వేలు రోడ్డులోని వి.వి. కండ్రిక క్రాస్ వద్ద పది లీటర్ల నాటుసారాతో అదే గ్రామానికి చెందిన మద్దిన వెంకటరమణ పట్టుబడ్డాడు. బుడుగుంట పల్లె గ్రామ ప్రాంతాలలో సుమారు 150 లీటర్ల నాటుసారా తయారీకి పనికి వచ్చే బెల్లంఊటను ధ్వంసం చేశారు. బెల్లం ఊట యజమానుల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
జిల్లా అడిషనల్ ఎస్పీ చక్రవర్తి ఆదేశాల మేరకు కోడూరు ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు దాడులు నిర్వహించినట్లు ఇన్స్పెక్టర్ రామ్మోహన్ తెలిపారు. ఎవరైనా అక్రమ మద్యం గాని, నాటుసారా గాని అమ్మినా, తయారుచేసినా వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇవీ చదవండి: రెండు కార్లు ఢీ.. ఒకరు మృతి