ETV Bharat / state

Atchannaidu: జగన్ రెడ్డి పాలనలో ప్రజలకు రక్షణ లేదు: అచ్చెన్నాయుడు

తెలుగుదేశం మద్దతుదారులపై వైకాపా వాలంటీర్ కత్తితో దాడి చేయడం దుర్మార్గామని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. జగన్ రెడ్డి నెత్తుటి రాజ్యంలో తెదేపా నేతలపై భౌతిక దాడులు నిత్యకృత్యంగా మారాయని ఆక్షేపించారు.

అచ్చెన్నాయుడు
అచ్చెన్నాయుడు
author img

By

Published : Jul 5, 2021, 8:34 PM IST

కడప జిల్లా రాయచోటి మండలం వల్లూరువాండ్లపల్లిలో తెదేపా మద్దతుదారులపై వైకాపా వాలంటీర్ కత్తితో దాడి చేయటం దుర్మార్గమని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. మహదేవపల్లి నరసింహారెడ్డి, నిర్మలమ్మలపై వేట కొడవళ్ళు, కత్తులు, రాడ్లుతో హత్యాయత్నం చేయటం రాక్షస పాలనకు నిదర్శనమని మండిపడ్డారు. జగన్ రెడ్డి నెత్తుటి రాజ్యంలో తెదేపా నేతలపై భౌతిక దాడులు నిత్యకృత్యంగా మారాయని ఆక్షేపించారు. హిట్లర్ పాలనలో యూదుల ప్రాణాలకు రక్షణ కరవైనట్లు జగన్ రెడ్డి తుగ్లక్ పాలనలో ప్రజల ప్రాణాలకు రక్షణ లేదని దుయ్యబట్టారు.

రాజ్యాంగ హక్కులను కాలరాసేలా వ్యవహరిస్తూ జగన్ రెడ్డి అనుచరులు ప్రజాస్వామ్య వ్యవస్థలో మారణహోమం సృష్టిస్తున్నారని అచ్చెన్న మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు ప్రశ్నార్థకంగా మారాయన్న ఆయన.. ఇదే తరహా దాడులు కొనసాగిస్తే తెదేపా చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

KUMBLE: 'స్పోర్ట్స్​ యూనివర్శిటీ పెడితే సహకరిస్తాను'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.