ఆర్టీసీ బస్సులు నడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కడప జిల్లా మైదుకూరు ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొదట ఐదు రూట్లలో 20 సర్వీసులు నడపనున్నారు. మైదుకూరు- ప్రొద్దుటూరు మధ్య ఐదు బస్సులు, మైదుకూరు- పోరుమామిళ్ల మధ్య ఐదు బస్సులు, మైదుకూరు - కడప మధ్య ఐదు బస్సులు, మైదుకూరు - బ్రహ్మంగారిమఠం మధ్య ఒక బస్సు నడపనున్నట్లు డిపో మేనేజర్ మోతిలాల్ నాయక్ తెలిపారు.
ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మాత్రమే సర్వీసులు నడుస్తాయని వివరించారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని మరిన్ని సర్వీసులు నడిపేందుకు నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. కండక్టర్ లేకుండానే సర్వీసులు నడుస్తాయి అన్నారు.
ఇదీ చదవండి: లాక్ డౌన్ ను అడ్డుపెట్టుకొని వైకాపా అవినీతికి పాల్పడింది