APMDC WORKERS PROTEST: ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేయాలంటూ కడప జిల్లా ఓబులవారిపల్లె మండలం మంగంపేటలోని ఏపీఎండీసీ అవుట్సోర్సింగ్, ట్రైనీ కార్మికులు నిరవధిక సమ్మెకు దిగారు. పునరావాసం కింద స్థానికులకు పదేళ్ల క్రితం అవుట్సోర్సింగ్, ట్రైన్ కార్మికులుగా ఉపాధి కల్పించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రెగ్యులరైజ్ చేస్తానని జగన్ హామీ ఇచ్చారని, మూడేళ్లు కావస్తున్నప్పటికీ నిర్ణయం తీసుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రెగ్యులరైజ్ చేసేందుకు ఆలస్యమైతే అప్పటివరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు నెరవేరేవరకూ నిరవధిక సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: