విద్యుత్ షాక్ తో దగ్ధమైన మొబైల్ దుకాణం కడప జిల్లా రాయచోటిలోని గాంధీ బజార్లో అగ్నిప్రమాదం జరిగింది. ఓ మొబైల్ దుకాణంలో విద్యుత్ షాక్ కారణంగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. గంటన్నర పాటు మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. మంటలు పై అంతస్తుకు ఎగబాకి.. అదుపు చేయడానికి వీలు కాలేదు. 3 అగ్నిమాపక యంత్రాలతో మంటలార్పేందుకు యత్నించిన సిబ్బంది... ఎట్టకేలకు మంటలను ఆర్పేశారు.
రూ.కోటి నష్టం
విద్యుత్ షాక్ కారణంగా మొబైల్ షాప్ దగ్ధం కావడంతో విలువైన మొబైల్స్‌తో పాటుఇతర సామాగ్రి పూర్తిగా దహనమయ్యాయి. కోటి రూపాయల మేర నష్టం జరిగినట్లు దుకాణ యజమాని తెలిపారు.
అస్తవ్యస్తంగా ఉన్న విద్యుత్ తీగలే కారణం
అస్తవ్యస్తంగా ఉన్న విద్యుత్ తీగల వల్లనే మొబైల్ దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించిందని స్థానికులు చెబుతున్నారు. ఎండ కారణంగా దుకాణంలో విద్యుత్ తీగలు కాలిపోయాయని తెలిపారు.