- సంకల్ప సిద్ధి మనీ సర్క్యులేషన్ కేసు.. కీలక నిందితుడు అరెస్ట్
KEY ACCUSED ARREST IN SANKALP CASE : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సంకల్ప్ సిద్ధి కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఇప్పటికే ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. తాజాగా కీలక నిందితుడు కిరణ్‌ను సైతం బెంగుళూరులో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- చింతామణి నాటక పరిష్కారానికి కమిటీని వేసే అంశాన్ని పరిశీలించండి :హైకోర్టు
చింతామణి నాటకాన్ని నిషేధిస్తే కళాకారుల జీవనోపాధి దెబ్బతింటుందని హైకోర్టు వెల్లడించింది. అభ్యంతరకర భాగాన్ని ప్రదర్శించకుండా కట్టిడి చేసే ప్రతిపాదన ఏదైనా ఉందా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. సామరస్య పూర్వకంగా సమస్యను పరిష్కరించేందుకు కమిటీ వేసే అంశాన్ని పరిశీలించాలని ప్రభుత్వానికి సూచించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పరిచయం.. ప్రమాదమై.. జీవితాలు ఆగమై..!
Dating App Frauds : ఒక్క ఆకర్షణీయమైన ఫొటో అందంగా ముగ్గులోకి దింపుతోంది. నాలుగు ఆకట్టుకునే మాటలు.. విద్యార్థుల నుంచి వృద్ధుల వరకు నిలువునా ముంచేస్తున్నాయి. బలహీన క్షణాన చేసిన పొరపాటును.. దోపిడీకి ఆయుధంగా వాడేస్తున్నారు. డేటింగ్‌యాప్‌ల మాటున సాగుతున్న ఈ సాంకేతిక దందా ఇప్పుడు తీవ్ర ‘సామాజిక’ సమస్యగా మారింది. బాధితుల సంఖ్య పదుల నుంచి భారీగా పెరుగుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- బీసీ డిక్లరేషన్ అమలే ప్రధానాంశంగా.. "వైసీపీ జయహో బీసీ మహాసభ"
YCP JAYAHO BC MAHASABHA: ప్రతిపక్ష నేత హోదాలో జగన్ మోహన్ రెడ్డి ఏలూరులో చేసిన బీసీ డిక్లరేషన్ అమలు ప్రధానాంశంగా.. ఈ నెల 7న విజయవాడలో "వైసీపీ జయహో బీసీ మహాసభ" జరపనున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. బీసీ మహాసభకు సన్నద్ధత, బీసీ నేతల సమీకరణపై ఉమ్మడి విజయనగరం జిల్లా నేతలు, ప్రజాప్రతినిధులతో మంత్రి బొత్స సత్యనారాయణ సమావేశమయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఈ బస్ షెల్టర్‌ను ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు.
ఎక్కడికైనా తరలించే వీలున్న బస్ షెల్టర్‌ను కేరళకు చెందిన యువకులు తయారు చేశారు. బైక్‌కు కట్టి బస్ షెల్టర్‌ను అవసరమైన ప్రాంతానికి తీసుకెళ్తున్నారు. కాసర్గోడ్ జిల్లాలో హైవే విస్తరణ పనుల్లో భాగంగా బస్ షెల్టర్‌ను కూల్చివేశారు. దీంతో ప్రయాణికులు, పాఠశాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం కాసర్గోడ్ జిల్లా పెరియా ప్రాంతంలోని యువకుల దృష్టికి వచ్చింది. దీంతో ఆ యువకుల బృందం మొబైల్ బస్ షెడ్‌ను నిర్మించాలని ఓ వినూత్నమైన కార్యక్రమం చేపట్టారు. దీని కోసం ఆ ప్రాంతంలోని వ్యాపారులు, సామాజిక సంస్థలను సంప్రదించి నిధులను సేకరించారు. అనంతరం, మొబైల్ బస్ షెడ్‌ను నిర్మించారు. ఈ షెడ్‌ను మోటర్‌బైక్‌కు జత చేసి ఎక్కడికైనా తరలించవచ్చు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆ రాష్ట్రంలో 76 శాతానికి రిజర్వేషన్లు.. అసెంబ్లీలో కీలక బిల్లులు పాస్
ఛత్తీస్‌గఢ్ శాసనసభ సంచలన నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి కీలక బిల్లులను ఆమోదించింది. దీంతో ఆ రాష్ట్రంలో రిజర్వేషన్ల కోటా 76 శాతానికి చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పద్మభూషణ్ అందుకున్న సుందర్ పిచాయ్.. భారత ప్రజలకు కృతజ్ఞతలు
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ భారత మూడో అత్యున్నత పౌరపురస్కారమైన పద్మభూషణ్‌ను అందుకున్నారు. ఈ సందర్భంగా భారత ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. భారతీయత ఎప్పటికీ తనతో పాటే ఉంటుందని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- బంగ్లాదేశ్‌తో సిరీస్.. టీమ్ఇండియాకు భారీ షాక్.. సీనియర్ పేసర్ దూరం!
బంగ్లాదేశ్‌తో సిరీస్‌కు ముందు టీమ్ఇండియాకు పెద్ద షాకే తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీనియర్ పేసర్ గాయం కారణంగా దూరం కానున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రామ్‌చరణ్‌కు ట్రూ లెజెండ్ అవార్డ్.. చిరంజీవి ఎమోషనల్ పోస్ట్
ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా కార్యక్రమంలో ట్రూ లెజెండ్‌గా తన తనయుడు, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ అవార్డు సొంతం చేసుకోవడంపై మెగాస్టార్ చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు. చరణ్ అవార్డు అందుకోవడం పట్ల గర్వంగా ఉందన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 2022లో సినిమాల జోరు... 2023లో సీక్వెల్‌కు తయారు
2022 సంవత్సరమంతా కొత్త చిత్రాల జోరు కొనసాగింది. అన్ని పరిశ్రమల్లోనూ ఈ ధోరణి కొనసాగింది. అయితే కొన్ని చిత్రాలు కొత్త సంవత్సరంలో సీక్వెల్‌కు రెడీగా ఉన్నాయి. వాటిపై ఓ లుక్కేద్దామా? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.