ETV Bharat / state

సరదాగా నేర్చుకుంది.. జాతీయస్థాయికి ఎదిగింది!

బాల్యం నుంచే ఆ చిన్నారికి క్రీడలంటే ఆసక్తి. ఆటల్లో మెళకువలు నేర్చుకోవడం అంటే... తనకి ఎంతో ఇష్టం. చిన్నప్పుడు సరదాగా నేర్చుకున్న చెస్..ఇప్పుడెన్నో అవార్డులను తెచ్చిపెడుతోంది. ప్ర‌త్య‌ర్థుల‌ను చిత్తుచిత్తుగా ఓడించి విజ‌యాన్ని త‌న ఖాతాలోకి వేసుకుంటోంది క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన స‌జోత్స్న. జిల్లా, రాష్ట్ర స్థాయిలో అనేక అవార్డులు సొంతం చేసుకున్న ఈ చిన్నారి..ఇప్పుడు జాతీయ స్థాయికి ఎంపికై అంద‌రి మ‌న్న‌న‌లు పొందుతోంది.

ap state chess champion sajyotsna selected to national  chess championship
చెస్ ఛాంపియన్ స‌జోత్స్న
author img

By

Published : May 30, 2020, 9:07 AM IST

క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరు మోడంప‌ల్లి వీధికి చెందిన క‌టారి రామ‌న్న‌, మునెమ్మ‌.. ప్ర‌భుత్వ పాఠ‌శాలల్లో ఉపాధ్యాయులుగా ప‌ని చేస్తున్నారు. వీరికి ఇద్ద‌రు కుమార్తెలు, ఒక కుమారుడు. రెండో అమ్మాయి క‌టారి స‌జోత్స్న.. నాలుగో త‌ర‌గ‌తి చ‌దువుతోంది. మూడేళ్ల క్రితం స‌జోత్స్న పుట్టిన రోజుకు అక్క విజ‌య‌జ్యోతి చ‌ద‌రంగం బోర్డును బ‌హుమ‌తిగా ఇచ్చింది.

అప్ప‌టి నుంచి చదరంగం అలవాటైన సజోత్స్న.. ప్రతిభను మెరుగుపరుచుకుంటూ వచ్చింది. బాలికలోని ఆసక్తిని గుర్తించిన తల్లితండ్రులు క‌డ‌పలోని శిక్ష‌కుడు అనిష్ దార్బ‌ర్ వ‌ద్ద చెర్పించారు. ఆయన సజోత్స్నకు మెళ‌కువ‌లు నేర్పారు. అప్ప‌టి నుంచి మ‌రింత ఉత్సాహంతో చదరంగంలో చెడుగుడు ఆడుతోంది.. ఈ చిచ్చరపిడుగు.

మూడేళ్ల కాలంలోనే బాలిక స‌జోత్స్న అనేక ప‌త‌కాలు త‌న ఖాతాలో వేసుకుంది. జిల్లా స్థాయిలో 30, రాష్ట్ర స్థాయిలో మ‌రో నాలుగు అవార్డులు ద‌క్కించుకుంది. ఫిబ్ర‌వ‌రిలో 14 నుంచి 16 వ‌ర‌కూ భీమ‌వ‌రంలో బాలిక‌ల విభాగం రాష్ట్ర స్థాయి పోటీల్లో స‌త్తా చాటిన స‌జోత్స్న... జాతీయ స్థాయికి ఎంపికైంది. ఏప్రిల్ 16 నుంచి 24 వ‌ర‌కూ హ‌ర్యానాలో జాతీయ స్థాయి పోటీలు జ‌ర‌గాల్సి ఉండ‌గా... క‌రోనా కారణంగా వాయిదా ప‌డ్డాయి.

ఆరేళ్ల వయసులోనే చదరంగంపై అనురక్తి పెంచుకున్న సజోత్స్న.. లాక్ డౌన్ కాలంలోనూ అంతే ఆసక్తిని కనబరుస్తోంది. చదవుకుంటూనే క్రీడ‌ల్లో సత్తా చాటుతోంది.

ఇదీ చూడండి:

అర్జున అవార్డుకు రాహుల్ నామినేట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.