కడప స్టీల్‌ప్లాంట్‌కు ఇనుప ఖనిజం సరఫరాపై రాష్ట్ర ప్రభుత్వం... నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌తో ఒప్పందం చేసుకోనుంది. ఏపీ హైగ్రేడ్ స్టీల్ కార్పొరేషన్‌కు అవసరమైన ముడి ఇనుము ఖనిజం కోసం ఈ నెల 18న ఓ అంగీకారానికి రానుంది. కడప స్టీల్‌ప్లాంట్‌కు ఈనెల 23న సీఎం జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. శంకుస్థాపనకు ముందే ఎన్ఎండీసీతో ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకోనుంది. ఛత్తీస్‌గఢ్‌లోని ఎన్ఎండీసీ గనుల నుంచి ముడి ఇనుము సరఫరా చేసేలా చూడాలని సర్కారు భావిస్తోంది.
3 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం
రూ.10 వేల కోట్ల పెట్టుబడితో ఏపీ హైగ్రేడ్ స్టీల్ కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమైంది. 3 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉంది. ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ మెకాన్ నివేదిక సిద్ధం చేస్తుంది. వచ్చే 35 ఏళ్లకు 160 నుంచి 200 మిలియన్ టన్నుల ముడి ఇనుము ఖనిజం అవసరమని ప్రభుత్వం అంచనా వేస్తుంది.
ఇదీ చదవండి: