వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని.. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. కడప జిల్లాలోని (flood victims in kadapa) అన్నమయ్య జలాశయం కట్ట తెగి ముంపునకు గురైన పులపుత్తూరు, మందపల్లి, తొగురుపేట ప్రాంతాల్లో ఆయన పర్యటించారు.
అయితే.. ప్రభుత్వమిచ్చే ఆర్థిక సహాయం ఏ మూలకూ సరిపోవడం లేదని బాధితులు సజ్జల దృష్టికి తీసుకొచ్చారు. నష్టాన్ని ఎవరూ పూడ్చలేరన్న సజ్జల.. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి
CM JAGAN REVIEW ON FLOODS: 'పూర్తిగా ధ్వంసమైన ఇళ్లకు కొత్త ఇళ్లు మంజూరు చేయాలి'