ETV Bharat / state

స్టీల్‌ప్లాంట్‌తో పరిసర ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందుతాయి: సీఎం

FOUNDATION STONE FOR KADAPA STEEL PLANT : జమ్మలమడుగులో ఉక్కు పరిశ్రమ నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంతమే కాకుండా కడప జిల్లా మొత్తం అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి జగన్మోహన్​రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. జేఎస్​డబ్ల్యూ స్టీల్​ప్లాంట్​కు ఆ సంస్థ ఛైర్మన్ సజ్జన జిందాల్​తో కలిసి సీఎం జగన్ భూమి పూజ చేశారు. 30 నెలల్లో మొదటి దేశ.. తర్వాత ఐదేళ్లలో రెండో దశ పూర్తవుతుందన్నారు.

FOUNDATION STONE FOR KADAPA STEEL PLANT
FOUNDATION STONE FOR KADAPA STEEL PLANT
author img

By

Published : Feb 15, 2023, 12:29 PM IST

Updated : Feb 15, 2023, 3:43 PM IST

FOUNDATION STONE FOR KADAPA STEEL PLANT : వైయస్సార్ జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లి వద్ద జిందాల్​ సౌత్​ వెస్ట్​(జేఎస్​డబ్ల్యూ) స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి సీఎం జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఉదయం 11 గంటలకు హెలికాప్టర్లో సున్నపురాళ్లపల్లి చేరుకున్న ముఖ్యమంత్రి.. జేఎస్​డబ్ల్యూ స్టీల్ గ్రూప్ ఛైర్మన్ సజ్జన్​ జిందాల్​తో కలిసి స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేపట్టే విధానాన్ని త్రీడీ రూపంలో తయారు చేసిన నమూనాను పరిశీలించారు. ఉక్కు పరిశ్రమ నిర్మాణం ఏ విధంగా సాగుతోంది అనే దానిపై సజ్జన జిందాల్.. సీఎం జగన్​కు వివరించారు.

రాష్ట్రంలో ఎమ్మెల్సీ కోడ్ ఉన్నందున తక్కువ మంది మాత్రమే భూమి పూజ కార్యక్రమానికి హాజరు కావలసిన పరిస్థితి వచ్చిందని.. లేదంటే పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఏర్పాట్లు చేసే వారమని సీఎం తెలిపారు. దేశంలోనే ప్రముఖ స్టీల్ కంపెనీ అయిన జిందాల్ చేతికి ఉక్కు పరిశ్రమ నిర్మించే బాధ్యత అప్పగించడం చాలా సంతోషంగా ఉందని సీఎం జగన్ అన్నారు.

"రెండు విడతలుగా స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణం సాగుతోంది. మంచి వ్యక్తి చేతుల్లోకి స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణం వెళ్తోంది. సజ్జన్‌ జిందాల్‌ ముందుకు రావడం అభినందనీయం. ఈ నిర్మాణం 3 మిలియన్‌ టన్నులతోనే ఆగిపోదు. 13 మిలియన్‌ టన్నుల సామర్థ్యానికి ప్లాంట్‌ చేరుకుంటుంది. రూ.700 కోట్లతో మౌలిక సదుపాయాల అభివృద్ధి. స్టీల్‌ప్లాంట్‌తో పరిసర ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందుతాయి"-సీఎం జగన్​

గతంలో తన తండ్రి ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేసిన తర్వాత.. కొన్ని కారణాల వల్ల ఆగిపోయిందని ఆ మహా నేత మరణం తర్వాత వచ్చిన పాలకులు ఎవరు కూడా పరిశ్రమ వైపు అడుగులు వేయలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెనకబడిన ఈ ప్రాంత అభివృద్ధి కోసం స్టీల్ ప్లాంట్ నిర్మించేందుకు అడుగులు వేస్తున్నామని తెలిపారు. జేఎస్​డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ సంస్థ 24 నుంచి 30 నెలల్లో మొదటి దశ నిర్మాణం పూర్తవుతుందని.. మరో 5 ఏళ్లలో రెండో దశ నిర్మాణం పూర్తి చేసుకుని మూడు మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి చేస్తుందనీ సీఎం తెలిపారు.

జిందాల్ సంస్థ 3 మిలియన్ టన్నుల సామర్థ్యంతోనే ఆగిపోకుండా ముందుకు వెళుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఉక్కు పరిశ్రమ కోసం ఈ ప్రాంతంలో 3500 ఎకరాలు జిందాల్​కు అప్పగించామని.. మరో 700 కోట్ల రూపాయలతో మౌలిక వసతుల సదుపాయాలు కల్పించి ఇస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు. గండికోట నుంచి రెండు టీఎంసీల నీటిని తరలించేందుకు పైప్​లైన్​లు కూడా వేస్తున్నామన్న సీఎం జగన్.. ఉక్కు పరిశ్రమ నిర్మాణం పూర్తయ్యేందుకు ఎలాంటి అవాంతరాలు జరగకుండా సీఎం హోదాలో భరోసా ఇస్తున్నట్లు వెల్లడించారు.

కడప జిల్లా అభివృద్ధికి పునాదిరాయి: కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తుండడం శుభ పరిణామం అని జిందాల్ గ్రూప్ ఛైర్మన్ సజ్జన్​ జిందాల్ అన్నారు. రాజశేఖర్​రెడ్డి తనకు మంచి మిత్రుడు అని.. ఆయన కుమారుడు కూడా ఇప్పుడు మంచి పాలన అందిస్తున్నాడని కితాబిచ్చారు. బళ్లారి ప్రాంతంలో కూడా 13 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేశామన్న సజ్జన్​ జిందాల్... జమ్మలమడుగు ప్రాంతంలో కూడా రెండు దశలో లక్ష్యానికి మించే ఉత్పత్తి చేస్తామని వెల్లడించారు. పరిశ్రమ నిర్మాణం పూర్తయితే ఒక్క జమ్మలమడుగు ప్రాంతం కడప జిల్లా ఉక్కు నగరంగా మారనుందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందుతాయనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

"కొత్త పరిశ్రమ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో 25 మిలియన్ టన్నుల ఉత్పత్తి స్థాయికి తీసుకెళ్తాం. ఇది పరిశ్రమకే కాదు.. కడప జిల్లా అభివృద్ధికి పునాదిరాయి"-సజ్జన్‌ జిందాల్‌, జిందాల్​ స్టీల్​ ప్లాంట్​ ఛైర్మన్​

2019 డిసెంబర్ 23న జమ్మలమడుగు ప్రాంతంలో తొలిసారి ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్.. ఇప్పుడూ అదే ప్రాంతంలో రెండోసారి స్టీల్ ప్లాంట్​కు భూమి పూజ చేయడం గమనార్హం. అయితే కడప స్టీల్​ ప్లాంట్​ నిర్మాణం ఈసారన్నా పూర్తి అవుతుందా అనే సందేహం అటు ప్రతిపక్షాలతో పాటు ఇటు ప్రజల్లోను నెలకొంది.

ఇవీ చదవండి:

Last Updated : Feb 15, 2023, 3:43 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.