కడప జిల్లా బి. కోడూరు మండలం రాజుపాలెం హరిజనవాడలో అంగన్వాడీ టీచర్‌గా పని చేస్తున్న ప్రశాంతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆమె మరణంపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భర్తే హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని ఆరోపిస్తున్నారు. బద్వేలు మండలం చెన్నంపల్లి దళితవాడకు చెందిన ప్రశాంతికి ఐదేళ్ల కిందట వివాహమైంది. ఈమెకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి.. రెండు లారీలు ఢీ... క్యాబిన్లలో డ్రైవర్ల అవస్థ!