ETV Bharat / state

'నగరాభివృద్ధి పనులు ఇక వేగవంతం' - కడపలో అభివృద్ధి కార్యక్రమాలు

నాలుగు సంవత్సరాలలో కడప నగర రూపురేఖలు మార్చడం జరుగుతుందని ఇందుకు ప్రజల సహాయ సహకారాలు ఎంతో అవసరమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అన్నారు. కడప నగరంలో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు.

amjadh basha on kadapa development
amjadh basha on kadapa development
author img

By

Published : Oct 10, 2020, 9:31 AM IST

కొవిడ్‌-19 కట్టడి చర్యలతో కడప నగరాభివృద్ధి పనుల్లో జాప్యం జరిగిందని, ఇకపై పనులు వేగవంతమవుతాయని ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా పేర్కొన్నారు. కడప నగర పరిధిలోని 1వ డివిజన్‌లోని బీసీ కాలనీలో రూ.21 లక్షలు, మోడమీదపల్లిలో రూ.18.5 లక్షలు, 35వ డివిజన్‌ నకాశ్‌లో రూ.25 లక్షలు, 36వ డివిజన్‌లోని పోలేరమ్మ ఆలయం వీధిలో రూ.15.50 లక్షలతో చేపట్టే రహదారుల నిర్మాణ పనులకు శుక్రవారం ఆయన భూమిపూజ చేశారు.

అనంతరం 34వ డివిజన్‌లోని ఖలీల్‌నగర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులు తాగునీటి సమస్యపై ఏకరవు పెట్టారు. దీనిపై స్పందించిన ఆయన వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఈఈ భాస్కరరావు, ఏఈ అంజలీకుమార్‌, వైకాపా నాయకులు దాసరి శివప్రసాద్‌, అజ్మతుల్లా, అహ్మద్‌, రాజశేఖర్‌రెడ్డి, చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: జగన్ అక్రమాస్తుల కేసులో ఇక రోజువారీ విచారణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.