ETV Bharat / state

'మండలాల్లో పరిపాలన వికేంద్రీకరణ చేయగలరా?' - రాజంపేటలో అమరావతి మద్దతు ర్యాలీ

సేవ్ ఆంధ్రప్రదేశ్ సేవ్ అమరావతి నినాదంతో తెదేపా నేతలు కడప జిల్లా రాజంపేటలో నిరసన చేపట్టారు. మాజీ ఎమ్మెల్సీ చెంగల్రాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీకి తెదేపా కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చారు.

amaravathi support rally in rajampeta
రాజంపేటలో అమరావతికి మద్దతుగా నిరసన ర్యాలీ
author img

By

Published : Jan 18, 2020, 5:26 PM IST

అమరావతికి మద్దతుగా రాజంపేటలో తెదేపా నేతల నిరసన

కడప జిల్లా రాజంపేటలో మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు ఆధ్వర్యంలో తెదేపా నేతలు నిరసన చేపట్టారు. ప్రభుత్వం చేసిన 3 రాజధానుల ప్రతిపాదనను తప్పుబట్టారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ సేవ్ అమరావతి అంటూ నినదించారు. రాజంపేట పాత బస్టాండ్ బైపాస్​ రోడ్డులో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం నుంచి శివాలయం మీదుగా మహాత్మా గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేశారు. సీఎం జగన్​కు మంచి బుద్ధి ప్రసాదించాలంటూ మహాత్ముడి విగ్రహాన్ని కోరారు. బోగస్ నివేదికలు, బోగస్ కమిటీలతో రాజధానిని మూడు ముక్కలు చేసేందుకు కుట్ర పన్నుతున్నారని చెంగల్రాయుడు ఆరోపించారు. అభివృద్ధి వికేంద్రీకరణకు తేదేపా వ్యతిరేకం కాదని చెప్పారు. పరిపాలన వికేంద్రీకరణకు మాత్రమే తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అన్ని మండలాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను వికేంద్రీకరించాలని.. ఒక్కొక్క గ్రామంలో ఒక్కో కార్యాలయం ఏర్పాటు చేయాలని సవాల్ విసిరారు. మనసు మార్చుకొని అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరారు.

ఇదీ చదవండి:

కడపలో ఎన్టీఆర్ వర్ధంతి.. సేవలు స్మరించుకున్న నేతలు

Intro:Ap_cdp_48_18_VO_save AP_save rajadhaani_Av_Ap10043
k.veerachari, 9948047582
సేవ్ ఆంధ్రప్రదేశ్ సేవ్ రాజధాని నినాదంతో తెదేపా నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. కడప జిల్లా రాజంపేట పట్టణంలో మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు ఆధ్వర్యంలో రాజంపేట పాత బస్టాండ్ బైపాస్ లో ని ఎన్టీఆర్ విగ్రహం శివాలయం మీదుగా మహాత్మా గాంధీ విగ్రహం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలవేసి ఓ మహాత్మా నీవైనా సీఎం జగన్ మోహన్ రెడ్డికి మంచి బుద్ధి ప్రసాదించాలని వేడుకున్నారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ తేదేపా నియోజకవర్గ బాధ్యుడు బత్యాల చెంగల్రాయుడు మాట్లాడుతూ బోగస్ నివేదిక బోగస్ కమిటీలతో రాజధానిని మూడు ముక్కలు చేసే కుట్రపన్నుతున్నారని విమర్శించారు అభివృద్ధి వికేంద్రీకరణకు తేదేపా వ్యతిరేకం కాదని కానీ పరిపాలన వికేంద్రీకరణ మాత్రమే వ్యతిరేకమన్నారు దమ్ము ధైర్యం ఉంటే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అన్ని మండలాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా ఒక్కొక్క గ్రామంలో ఒక కార్యాలయం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మనసు మార్చుకొని అమరావతి నే రాజధానిగా కొనసాగించాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ సుధాకర్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Body:సేవ్ ఆంధ్రప్రదేశ్ సేవ్ రాజధాని

Conclusion:మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.