Ambati Rambabu: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కలల ప్రాజెక్టులన్నింటినీ సకాలంలో పూర్తిచేసి ప్రజల మన్ననలు పొందుతామని.. జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. కడప జిల్లా వేంపల్లె మండలం ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్‌ను మంగళవారం ఆయన సందర్శించి నివాళులు అర్పించారు. అక్కడే ఉన్న వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు.
రాష్ట్రంలో నీరు లేకుండా ఎకరా పొలం కూడా ఎండిపోవద్దని రాజశేఖరరెడ్డి జలయజ్ఞాన్ని ప్రారంభించి ఎన్నో సాగునీటి ప్రాజెక్టులకు రూపకల్పన చేశారన్నారు. అందులో ప్రధానమైన పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడమే ఆయన తనయుడు, సీఎం జగన్ ధ్యేయమని పేర్కొన్నారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని వివరించారు. 1989లో గుంటూరు జిల్లా రేపల్లె నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచానని.. అప్పటినుంచి ఇప్పటివరకూ వైఎస్ కుటుంబం వెంటే నడుస్తున్నానని.. తనకు మంత్రి పదవి వస్తుందని ఊహించలేదన్నారు.
ఇదీ చదవండి:
HIGH COURT : సినిమా టికెట్ ధరలోనే.. సర్వీసు ఛార్జీలను చేర్చటంపై హైకోర్టులో విచారణ