కడప శివారులోని కేఎల్ఎం ఇంజినీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లాలోని 10 అసెంబ్లీ, 2 పార్లమెంటు నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. రెండు బ్లాకుల్లో ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. 314 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్లు, సర్వీసు ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత... ఈవీఎం ఓట్ల లెక్కింపు 8.30 గంటలకు చేపడతారు. 2 వేల మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. 1260 మంది పోలీసులు భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ముందుగా కమలాపురం, కోడూరు ఫలితాలు... చివరగా పులివెందుల ఫలితాలు వెల్లడయ్యే అవకాశముందని ఎన్నికల అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి...