తమ సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ కార్మికులు కడప నగర పాలక కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. రెండు నెలల నుంచి జీతాలు ఇవ్వకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. కరోనాతో మృతి చెందిన ఆనంద్ అనే కార్మికుడికి రూ.50 లక్షలు పరిహారం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 45 మంది కార్మికులు కరోనాతో చనిపోయారని.. కరోనా విధులు నిర్వహిస్తున్న కార్మికులకు అదనపు జీతం ఇవ్వాలని వారు కోరారు.
ఇదీ చదవండి