కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాజీలేని పోరాటం చేసి... హక్కులు కాపాడుకుందామని ఏఐటీయూసీ కడప జిల్లా కార్యదర్శి రాధాకృష్ణ పేర్కొన్నారు. కడప జిల్లా రాజంపేట ఏఐటీయూసీ కార్యాలయంలో అనుబంధ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ... ఏఐటీయూసీ సంస్థ స్థాపించి 100 సంవత్సరాల కాలంలో ఎన్నో పోరాటాల ద్వారా కార్మికుల హక్కులను సాధించుకున్నామని తెలిపారు. ఈనెల 31న రాజంపేటలో పెద్దఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అనంతరం బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఇసుక విధానంతో లక్షలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ మద్యం విధానం దారుణంగా ఉందని విమర్శించారు. త్వరలో ఇసుక విధానంపై పోరాటం చేస్తామని చెప్పారు.
ఇదీ చదవండీ... శ్రీశైలం, సాగర్‌కు భారీగా వరద.. దిగువకు నీటి విడుదల