ETV Bharat / state

'కన్నవారినే ఇంటి నుంచి గెంటేసిన సుపుత్రుడు..!'

author img

By

Published : Jan 26, 2020, 10:51 AM IST

ముదిమి వయసులోని తల్లిదండ్రులు తనకు భారం అనుకున్నాడు ఆ సుపుత్రుడు. వృద్ధులన్న కనికరం లేకుండా వారిని కొడుతూ.. అన్నం పెట్టకుండా మానసిక క్షోభకు గురిచేశాడు. తనను పెంచి పెద్ద చేశారన్న కృతజ్ఞత చూపకుండా ఇంటి నుంచి గెంటేశాడు. తమ బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆ వృద్ధ దంపతులు పోలీసులను ఆశ్రయించారు. కడప జిల్లా రైల్వేకోడూరులో జరిగిన ఘటన వివరాలివి..!

aged couple had approached the police due to them son in railway kodur
వెంకట సుబ్బయ్య , సుబ్బమ్మ
కన్నకొడుకు ఇంటి నుంచి గెంటేశాడని వృద్ధ దంపతుల ఆవేదన

కడప జిల్లా రైల్వే కోడూరు మండలం సి. కమ్మ పల్లికి చెందిన వృద్ధ దంపతులైన వెంకట సుబ్బయ్య , సుబ్బమ్మ వయస్సు 80 సంవత్సరాలు. వారికి ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు. తమ కుమారుడు ఇంటి నుంచి గెంటేశాడని ఆ దంపతులు పోలీసులను ఆశ్రయించారు. తమకు ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ తీసుకొని కొడుతున్నాడని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటిని సైతం స్వాధీనం చేసుకున్నాడని వాపోయారు. ఎక్కడికైనా పోయి బతకమని తమ కొడుకు చెబుతున్నాడని ఆ వృద్ధ దంపతులు కన్నీటి పర్యంతమయ్యారు. ఎక్కడికి వెళ్లాలో తెలియక తమకు న్యాయం చేయాలని పోలీసుల దగ్గరకు వచ్చినట్లు చెప్పారు. దీనిపై స్పందించిన పోలీసులు కుమారుడికి కౌన్సిలింగ్​ ఇచ్చారు.

ఇదీ చూడండి:

నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్టు: 3 దుంగలు స్వాధీనం

Intro:AP_CDP_03_25_AMMA_NANNA_AVB_VO_AP10187
CON: వెంకటరమణ, కంట్రిబ్యూటర్, రైల్వేకోడూరు.
ఫోన్. 9949609752.

Body:కడప జిల్లా రైల్వే కోడూరు మండలం సి. కమ్మ పల్లికి చెందిన వెంకటసుబ్బయ్య , సుబ్బమ్మ వయస్సు80 సంవత్సరాలు. తమ కుమారుడు ఇంటినుండి గెంటి వేశాడని ఈరోజు సాయంత్రం పోలీసులను ఆశ్రయించారు. మేము సంపాదించిన రెండెకరాల భూమిని కూడా అమ్మి ఖర్చు చేశాడని, తమకు ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ తీసుకుని కొట్టేవాడిని తెలిపారు. అంతేకాకుండా ఈ వయసులో మా ఇంటి నుండి వేసాడని, ఎక్కడికైనా పోయి జీవించాలని చెబుతున్నాడని తెలిపారు. ఈ వయసులో మేము ఎక్కడికి పోవాలి తెలియక పొలిస్టేషన్ వచమను తెలిపారు. దీంతో పోలీసులు వారి కుమారుడు పిలిపించి వృద్ధ దంపతులు సరిగా చూసుకోవాలని . లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకోవలసి వస్తుందని పోలీసులు తెలిపారు.

బైట్స్.1. వెంకటసుబ్బయ్య, సుబ్బమ్మ, వృద్ధ దంపతులు.
2. వెంకటేశ్వర్లు, ఎస్సై రైల్వేకోడూరు.

Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.