యువతిని దారుణంగా హత్య చేసిన నలుగురు నిందితులను కడప జిల్లా పోరుమామిళ్ల పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 11న ఆర్టీసీ బస్టాండ్‌లో రాత్రి 10గంటల సమయంలో ఒంటరిగా కావ్యను తీసుకెళ్లి అనుభవించాలని పోరుమామిళ్ల పట్టణానికి చెందిన జిలానిభాష, జయసింహ, నాగేంద్ర ప్రసాద్, మహబూబ్ బాషా పథకం పన్నారు. ఆటోలో భారత్ వాటర్‌ప్లాంట్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ బలాత్కారం చేయబోగా కావ్య ప్రతిఘటించింది. కేకలు వేయడంతో... గొంతునులిమి చంపేశారు. అనంతరం రామాయపల్లి వైశ్య స్మశాన వాటిక వద్ద శవాన్ని పడేసి పారిపోయినట్లు మైదుకూరు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. నిందితులను తక్కువ సమయంలో అరెస్టు చేసినందుకు పోరుమామిళ్ల సీఐ మోహన్‌రెడ్డి, సిబ్బందిని డీఎస్పీ శ్రీనివాసులు అభినందించారు.
ఇదీ చదవండీ...