కడప జిల్లా రైల్వేకోడూరు మండలం సెట్టిగుంట రైల్వేస్టేషన్ వద్ద ద్విచక్రవాహనం అదుపుతప్పి చెట్టుకు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరణించిన వ్యక్తి సెట్టిగుంటకు చెందిన మునీంద్ర(38)గా పోలీసులు గుర్తించారు. రైల్వేకోడూరు నుంచి తన స్వగ్రామానికి వెళ్తుండగా ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి :