ETV Bharat / state

మైలవరం పంచాయతీరాజ్ ఏఈఈ సుబ్బయ్య ఇంట్లో అనిశా సోదాలు - acb rides

ప్రొద్దుటూరులో ఏసీబీ దాడులు స్థానిక అధికారుల్లో కలకలం రేపాయి. మైలవరం పంచాయతీరాజ్ ఏఈఈ సుబ్బయ్య ఇంట్లో ఉదయం నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 2 కోట్లకు పైగా ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు.

సుబ్బయ్య అవినీతిలో అప్ అయ్యా!
author img

By

Published : Jul 2, 2019, 11:19 AM IST

సుబ్బయ్య అవినీతిలో అప్ అయ్యా!

కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో ఏసీబీ దాడులు స్థానిక అధికారుల్లో కలకలం రేపాయి. మైలవరం పంచాయతీరాజ్ ఏఈఈ సుబ్బయ్య ఆదాయానికి మించిన ఆస్తులున్నాయన్న అభియోగంపై అనిశా సోదాలు చేపట్టింది. ఉదయం ఆరుగంటలకే పొద్దుటూరు చేరుకున్న ఏసీబీ అధికారులు సుబ్బయ్య ఇంట్లో సోదాలు చేపట్టారు. అనిశా డీఎస్పీ నాగభూషణం ఆధ్వర్యంలో సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు రూ.2 కోట్ల మేర ఆదాయానికి మించిన ఆస్తులు గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. 568 గ్రాముల బంగారం, కేజీ 600 గ్రాముల పెండి స్వాధీనం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సుబ్బయ్య పేరున 3 గృహాలు, 2 ప్లాట్లు, భార్య పేరున 10 ప్లాట్లు, గుర్తించారు. 1991లో అనంతపురం జిల్లా రామగిరి పంచాయతీరాజ్ ఏఈఈ గా ఉద్యోగంలో చేరారు. వల్లూరు, ముద్దనూరు, కొండాపురం, దువ్వూరు, వంటి మండలాల్లో ఏఈఈగా విధులు నిర్వర్తించిన సుబ్బయ్య ప్రస్తుతం మైలవరంలో ఏఈఈగా పని చేస్తున్నారు. సుబ్బయ్య స్వస్థలం పొద్దుటూరుగా అనిశా రికార్డుల్లో తెలిసింది. ప్రస్తుతం ఆయన పేరున పొద్దుటూరు సహకార బ్యాంకులో లాకర్ గుర్తించారు. 1991 నుంచి ఆస్తులు కూడబెట్టినట్లు అనిశా సాదాల్లో గుర్తించారు.

Intro:AP_RJY_87_30_Bike_Vyanu_Dhi_AV_AP10023
ETV Bharat:Satyanarayana(RJY CITY)
E.G.Distic

( )తూర్పు గోదావరి జిల్లా రాజానగరం వద్ద జాతీయ రహదారి పై కలవచర్ల కూడలి వద్ద రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి సంఘటనా స్థలంలో మృతిచెందగా మరో వ్యక్తి ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతు మృతి చెందాడు. రాజానగరం సీఐ సురేష్ బాబు తెలిపిన సమాచారం మేరకు మారేడుమిల్లి నుంచి కొంకుదురు వెళ్ళుతూ పడాల శ్రీనివాస్ రెడ్డి ,కర్రీ మధుసూదన్ రెడ్డి తమ బైక్ పై రాజానగరం వద్ద కలవచర్ల కూడలిలో హై స్కూల్ వైపు వెళ్లేందుకు ఆగారు. అదే సమయంలో రాజమహేంద్రవరం వైపు నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న ఐషర్ వ్యాన్ వారి బైకును ఢీ కొట్టింది. శ్రీనివాస్ రెడ్డి దాదాపు వంద మీటర్ల దూరం ఈడ్చుకుంటూ పోవడంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. మధుసూదన్ రెడ్డి కి సైతం తలకు తీవ్రమైన గాయాలు తగిలాయి. అతను చికిత్స నిమిత్తం జిఎస్ఎల్ ఆస్పత్రికి తీసుకువెళ్ళగా చికిత్స చేస్తూ మృతిచెందాడు. ప్రమాదానికి కారణమైన ఐషర్ వ్యాన్ ఆగకుండా వెళ్లిపోవడంతో పోలీసులు స్థానికులు వెంబడించారు . మురారి వద్ద వ్యాను డివైడర్ ను ఢీ కొట్టి నిలిచిపోవడంతో డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.Body:AP_RJY_87_30_Bike_Vyanu_Dhi_AV_AP10023Conclusion:AP_RJY_87_30_Bike_Vyanu_Dhi_AV_AP10023

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.