కడప జిల్లా చిట్వేలి మండలం కుమ్మరి పల్లికి చెందిన దివ్యభారతి పురిటి నొప్పులు రావడంతో గురువారం రాత్రి చిట్వేలి ప్రభుత్వ ఆసుపత్రికి భర్త బంధువులతో వెళ్లారు. అక్కడ నర్సులు దివ్యభారతిని పరిశీలించి కాన్పు కష్టం అవుతుందని,వైద్యురాలు భార్గవి పరిశీలించి రాజంపేటకి తీసుకు వెళ్లామన్నారు. అక్కడి నుంచి 108 వాహనంలో తీసుకువెళ్లగా పట్టణ శివారులోకి రాగానే పురిటి నొప్పులు అధికమయ్యాయి. వాహనంలోని ఈఎంటి సుధాకర్, పైలెట్ నరసింహారెడ్డి కాన్పు చేశారు. ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చారు. అదే వాహనంలో ఆసుపత్రికి తీసుకొచ్చారు. బాధితురాలి భర్త గంగాధర్ మాట్లాడుతూ కుమ్మర పల్లె నుంచి చిట్వేల్ వైద్యశాలకు వెళ్లగానే అక్కడ నర్సులు చూశారు. కాన్పు కష్టం అన్నారు. అంతలోనే అక్కడికి వచ్చిన డాక్టర్ వాహనంలోనే పరీక్షించారు. వెంటనే రాజంపేటకు తీసుకెళ్లాలని సూచించారు. ఇక్కడ కాన్పు చేసేందుకు అవసరమైన పరికరాలు అందుబాటులో లేవని రాజంపేటకు తీసుకెళ్తే అక్కడ కష్టమైతే కడపకైనా వెళ్లవచ్చునని సలహా ఇచ్చారు. ఆస్పత్రిలో కష్టమేనా కాన్పు 108 వాహనంలో సురక్షితంగా చేశారు. వారి వల్ల కానిది వీరు ఇలా చేశారో వైద్యులకే తెలియాలని ఆయన అభిప్రాయపడ్డారు..
ఇదీ చూడండి:మహిళ అనుమానాస్పద మృతి