A Software Engineer Life Turned Upside Down in Kadapa: మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన అతను చదువులో ఎప్పుడూ ముందుండేవాడు. ఉన్నత విద్య పూరైన తర్వాత మంచి ఉద్యోగం. తమ కుమారుడికి ఉద్యోగం లభించడంతో మధ్య తరగతి కుటుంబీకులైన ఆ తల్లిదండ్రులు ఆనందంతో మురిసిపోయారు. కానీ, ఆ ఆనందం వారికి ఎంతో కాలం నిలవలేదు. కొద్ది రోజుల్లోనే ఉద్యోగం సంపాదించిన కుమారుడు కోమాలోకి పోవడం, వారి సంతోషాన్ని హరించింది.
రెండు పదుల వయసున్న కుమారుడు ఉద్యోగం చేసి తమను సంతోషంగా చూసుకుంటాడని భావించిన తల్లిదండ్రులకు ఆ సంతోషం ఎంతోకాలం నిలవలేదు. వారి కుమారుడు కోమాలోకి చేరుకుని మంచానికే పరిమితమైపోవడంతో, చికిత్స కోసం తెలిసిన ఆసుపత్రులన్నీ తిరిగి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు. చివరకు వైద్యం అందించడానికి నగదు లేకపోవడంతో తమ కుమారుడ్ని బతికించుకోవడానికి దాతల సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.
'డెత్ పంచ్'తో కోమాలోకి యువ బాక్సర్.. రెండు రోజులకు మృతి
బాధితుని తల్లిదండ్రుల వివరాల ప్రకారం కడప జిల్లాలోని శాంతినగర్‌లో జయకుమార్, అంజనమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. వీరిలో పెద్ద కుమారుడైన తరుణ్ చిన్నతనం నుంచే చదువులో ముందుండేవాడు. ఉన్నత విద్య అనంతరం రెండు సంవత్సరాల క్రితం బెంగళూరులోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. కుమారుడు ఉద్యోగం సాధించడంతో తల్లిదండ్రులు ఎంతో సంబరపడిపోయారు.
ఉద్యోగం చేస్తున్న తరుణ్ గతేడాది దసరా పండగకు బెంగళూరు నుంచి ఇంటికి వచ్చాడు. ద్విచక్ర వాహనంపై పనిమీద బయటకు వెళ్లిన తరుణ్ ఆర్టీసీ వర్క్‌షాప్ నుంచి వెళ్తుండగా, అక్కడున్న మట్టికుప్పలను గమనించక ప్రమాదానికి గురయ్యాడు. ప్రమాదం జరిగిన సమయంలో ఆర్టీసీ వర్క్‌షాప్ వద్ద కల్వర్టు నిర్మాణ పనులు కొనసాగాయి. పనులు నిర్మాణంలో ఉండగా అక్కడ ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకపోవడం, రోడ్డుకు అడ్డంగా మట్టి ఉండటం గమనించని తరుణ్ ద్విచక్ర వాహనం నేరుగా మట్టి కుప్పలను ఢీకొట్టింది.
వాషింగ్ మెషిన్‌లో పడ్డ చిన్నారి.. 15 నిమిషాలు సర్ఫ్ నీళ్లలోనే.. 7 రోజులు కోమాలో ఉండి..
ఈ ప్రమాదంలో గాయపడిన తరుణ్‌కు తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతను కోమాలోకి చేరుకున్నాడు. నెల్లూరు, తిరుపతి నగరల్లోని ప్రముఖ ఆసుపత్రులకు తిప్పినా తరుణ్ ఆరోగ్యం కుదుట పడలేదు. అక్కడి వైద్యులు మెరుగైన వైద్యం కోసం బెంగళూరు, చెన్నె, దిల్లీలోని ఆసుపత్రుల్లో వైద్యం అందిస్తే మెరుగుపడే ఆవకాశం ఉందని సూచిస్తున్నారు.
దాదాపు 40లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు సూచించడంతో, దిక్కుతోచని స్థితిలో బాధితుని తల్లిదండ్రులు ఉన్నారు. ఇప్పటికే వారు అందినకాడికి అప్పు చేసి 15 లక్షల రూపాయల వరకు వైద్యానికి ఖర్చు చేసినట్లు వివరించారు. ఇంకా అప్పు చేసే స్థోమత లేక తరుణ్‌ను ఇంటి వద్దే ఉంచారు.
రోడ్డు నిర్మాణ పనులు నడుస్తున్న దగ్గర అక్కడ ఏమీ హెచ్చరికలు పెట్టకపోవడంతో నా కుమారుడు ప్రమాదానికి గురయ్యాడు. కోమాలోకి చేరుకోవడంతో ఆసుపత్రులన్నీ తిప్పాము. ఇతర రాష్ట్రాలకు తీసుకువెళ్లమని వైద్యులు చెప్పారు. అంత ఆర్థిక స్థోమత లేక ఇంటి దగ్గరే ఉంచుకున్నాము. దాతలు సహాయం చేసి నా కుమారుడ్ని బతికించమని వేడుకుంటున్నాను." - అంజనమ్మ, తరుణ్ తల్లి
" తలకు బలమైన గాయామై కోమాలోకి వెళ్లాడు. ఇంతవరకు అప్పుచేసి 15 లక్షల వరకు ఖర్చుపెట్టాము. ఎవరైనా దాతలు సహాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము." - జయ కుమార్, తరుణ్ తండ్రి
ఆస్కార్ తెచ్చిన ఆర్థిక సహాయం.. ఏనుగుల సంరక్షకులకు సీఎం బంపర్ ఆఫర్
జీవచ్ఛవంలా మంచంలో పడిఉన్న కుమారుడికి సేవలు చేసుకుంటూ, అతనిలో భవిష్యత్‌ను చూసుకుంటున్నారు ఆ తల్లిదండ్రులు. తమకు సేవలు చేస్తాడానుకున్న కుమారుడికే తాము సేవలు చేస్తుంటే గుండె బరువెక్కిపోతోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కుమారుడి ఆరోగ్య పరిస్థితి సాధారణంగా మారాలాని వారు కోరుకుంటున్నారు. దాతలెవరైనా ముందుకు వచ్చి తమ కుమారుడ్ని బతికించాలని వారు వేడుకుంటున్నారు. దాతలు దయతలిస్తే తమ కుమారుడు మామూలు జీవితాన్ని కొనసాగిస్తాడని, లేకపోతే జీవితాంతం అలాగే ఉండాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.