ETV Bharat / state

అరుదైన వ్యాధితో బాధపడుతున్న వృద్ధురాలు - rare eye problems

కడప శివారులోని కృష్ణాపురంలో ఓ వృద్ధురాలు అరుదైన వ్యాధితో బాధపడుతుంది. కను రెప్పలు తరచూ మూసుకుపోయి నరకయాతన అనుభవిస్తుంది. ఆమెకు ప్రతి నెల మందులకు వేల రూపాయలు ఖర్చవతున్నాయి. అడగని వారికి కూడా సాయం చేసే సీఎం జగన్...​ తమను ఆదుకోవాలని వృద్ధురాలు, ఆమె కుమారుడు వేడుకుంటున్నారు.

అరుదైన వ్యాధితో బాధపడుతున్న వృద్ధురాలు
అరుదైన వ్యాధితో బాధపడుతున్న వృద్ధురాలు
author img

By

Published : Jun 21, 2020, 9:42 PM IST

కడప శివారులోని కృష్ణాపురం గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలు అరుదైన వ్యాధితో బాధ పడుతుంది. ఆమెకు దాదాపు నలభై ఏళ్ల కిందట కృష్ణారెడ్డితో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొడుకు చెన్నారెడ్డి కడప కర్మాగారంలో చిన్నపాటి ఉద్యోగం చేస్తూ తల్లిదండ్రులను పోషిస్తున్నాడు. కానీ ఆ కుటుంబం తీరని కష్టాలతో కాలం నెట్టుకొస్తుంది. పది లక్షల మందిలో ఒకరికి వచ్చే జబ్బు ఆ వృద్ధురాలికి వచ్చింది.

ఆమెకు తరచూ కనురెప్పలు మూసుకుపోతాయి. ఇలా దాదాపు ఎనిమిదేళ్ల నుంచి అవస్థ పడుతోంది. కొన్ని సందర్భాల్లో 24 గంటల పాటు కనురెప్పలు మూసుకుని ఉంటాయి. పలు ఆస్పత్రుల్లో చూపించినప్పటికీ నయం కాలేదు. తిరుపతిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా అక్కడ వైద్యులు పరీక్షించి మందులు ఇచ్చారు. ఆ మందులు వేసుకున్న అంతసేపు కనురెప్పలు తెరుచుకుని ఉంటాయి. లేదంటే మూసుకుని ఉంటాయి. ఎవరన్న చేతులతో బలవంతంగా వాటిని పైకెత్తినప్పటికీ మూసుకునే ఉంటాయి.

ఇలా ఆ వృద్ధురాలు నరకయాతన అనుభవిస్తుంది. ప్రతి నెల మందుల కోసం వేల రూపాయలు ఖర్చవుతుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్​ రెడ్డి ప్రభుత్వం అడగని వారికి కూడా సహాయం చేస్తుందని... తమ కుటుంబానికి సహాయం చేసి ఆదుకోవాలని చెన్నారెడ్డి కోరారు.

ఇదీ చూడండి: కరోనా దెబ్బకు ఆటోమెుబైల్‌ రంగం కుదేలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.