ETV Bharat / state

ఈ నెల 26న దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల సార్వత్రిక సమ్మె - strike of labor unions news

కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చిన్నట్లు ఐఎఫ్​టీయూ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసాద్​ తెలిపారు. కడప ప్రెస్​క్లబ్​లో గోడ పత్రాలను ఆవిష్కరించారు.

strike of labor unions
సమ్మెకు సంబంధించి గోడ పత్రాల ఆవిష్కరణ
author img

By

Published : Nov 18, 2020, 6:15 PM IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వర్గంపై చేస్తున్న దాడికి వ్యతిరేకంగా ఈ నెల 26న సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చినట్లు ఐఎఫ్​టీయూ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసాద్​ అన్నారు. సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ కడప జిల్లాలోని ప్రెస్​క్లబ్​లో గోడ పత్రాలను ఆవిష్కరించారు.

దాదాపు 500 కార్మిక సంఘాలు సమ్మెలో పాల్గొంటాయని చెప్పారు. చలో దిల్లీ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్మికుల పట్ల సర్కారు మొండివైఖరి ప్రదర్శిస్తుందని మండిపడ్డారు. కొవిడ్​ సమయంలో నష్టపోయిన భవన నిర్మాణ కార్మికులకు అందిస్తానన్న పదివేలు ఆర్థిక సాయం వెంటనే అందించాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చదవండి:

ప్రభుత్వ వైద్యుల తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.