కడప జిల్లా జమ్మలమడుగు పట్టణానికి చెందిన ఎనిమిది మందిని క్వారంటైన్‌కు తరలించారు. వీరిలో ఆర్టీసీ కార్మికులతో పాటు.. మరో ఆరుగురు నిమ్మ రైతులు ఉన్నారు. వారం రోజుల కిందట జమ్మలమడుగు మండలం గండికోటకు చెందిన ఆరుగురు రైతులు తమిళనాడులోని కోయంబేడుకు నిమ్మకాయలు తీసుకెళ్లారు. జమ్మలమడుగు తిరిగి వచ్చిన తర్వాత వారు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. వారిని వైద్య పరీక్షల నిమిత్తం ప్రొద్దుటూరు ఆస్పత్రికి తరలిస్తున్నట్లు సీఐ మధుసూదన్ రావు తెలిపారు. వైద్య పరీక్షల అనంతరం 14 రోజుల పాటు అక్కడే ఉంటారని సీఐ తెలిపారు. ఇటీవల ఆర్టీసీ బస్సులో సరకును తమిళనాడు రాష్ట్రానికి తీసుకెళ్లిన ఇద్దరు డ్రైవర్లు మంగళవారం తిరిగి వచ్చారు. వారిని సైతం వైద్య పరీక్షల అనంతరం ప్రొద్దుటూరుకు తరలిస్తామని తెలిపారు.
ఇదీ చూడండి ప్రధాన వార్తలు @ 9 PM