ETV Bharat / state

వైకాపా ఫిర్యాదు... ముగ్గురు ఐపీఎస్ అధికారుల బదిలీ - complaint

రాష్ట్ర రాజకీయాలు రోజురోజుకి ఆసక్తికరంగా మారుతున్నాయి. వివేకా హత్య తరువాత ఆంధ్రా పోలీసులపై నమ్మకం లేదంటూ వైకాపా చేసిన ఫిర్యాదుపై ఈసీ చర్యలు తీసుకుంది. ముగ్గురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది.

ఐపీఎస్ అధికారులు
author img

By

Published : Mar 26, 2019, 11:05 PM IST

Updated : Mar 27, 2019, 1:20 AM IST

police, tranfer, ips
ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావు
రాష్ట్రంలో ఎన్నికల వేళ ముగ్గురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు, కడప ఎస్పీ రాహుల్ దేవ్, శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నం స్థానచలనం పొందారు. ముగ్గురు అధికారులు ప్రధాన కార్యాలయానికి రిపోర్ట్ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.
police, tranfer, ips
శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నం
police, tranfer, ips
కడప ఎస్పీ రాహుల్​ దేవ్
రాష్ట్రంలో పోలీస్ ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఇటీవల ఎన్నికల సంఘానికి వైకాపా ఫిర్యాదు చేసింది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య తర్వాత స్థానిక పోలీసులతో ఏపీ ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు పదే పదే ఫోన్‌లో మాట్లాడారని ... తన ముందే కడప ఎస్పీకి పలుమార్లు ఫోన్ కాల్స్ వచ్చాయని... వివేకా హత్య జరిగిన రోజున జగన్ వెల్లడించారు. తమ బాబాయిహత్యకేసు దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు చంద్రబాబుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఐపీఎస్ ఉన్నతాధికారుల సాయంతో ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని ఈసీకివైకాపా ఫిర్యాదు చేసింది. వైకాపా నేత విజయసాయిరెడ్డి నిన్న కేంద్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిసి మరోసారి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ముగ్గురు అధికారులను ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది.

Intro:AP_ONG_82_26_NOMINATION_PARISEELANA_AV_C7

ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజక వర్గం పరిధిలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ముగిసింది. మొత్తం 26 నామినేషన్లు దాఖలు కాగా అందులో 7 నామినేషన్లు తిరస్కరణకు గురైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రామకృష్ణారెడ్డి తెలిపారు.తెదేపా అభ్యర్థి కందుల నారాయణరెడ్డి తండ్రి నారాయణరెడ్డి నామినేషన్ తిరష్కరణకు గురైంది. మరో పక్క వైకాపా అభ్యర్థి కుందురు నాగార్జునరెడ్డి ఆంధ్రబ్యాంక్ లో అప్పు ఉన్నట్లు అఫిడవిట్ లో పేర్కొనలేదని తెదేపా నాయకులు పిర్యాదు చేశారు. వారికి వ్రాత పూర్వకంగా సమాధానం చెప్పామని....నాగార్జునరెడ్డి నామినేషన్ తిరష్కరణకు గురికాలేదని ఎన్నికల రిటర్నింగ్ అధికారి తెలిపారు.

Body:పరిశీలన.

Conclusion:8008019243.
Last Updated : Mar 27, 2019, 1:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.