ETV Bharat / state

నీటికుంటలో పడి ఇద్దరు చిన్నారుల మృతి

కడప జిల్లా గూడెంచెరువు రాజీవ్​నగర్​ కాలనీలో నివాసం ఉంటున్న ఇద్దరు చిన్నారులు నీటి కుంటలో పడి మృతి చెందారు. ఘటన స్థలం వద్దకు చేరుకుని విలపిస్తున్న తల్లిదండ్రలను చూసి, స్థానికులు కంటతడిపెట్టారు.

నీటికుంటలో పడి ఇద్దరు చిన్నారుల మృతి
author img

By

Published : Sep 9, 2019, 5:10 PM IST

నీటికుంటలో పడి ఇద్దరు చిన్నారుల మృతి

కడప జిల్లా జమ్మలమడుగు గూడెంచెరువు సమీపంలోని రాజీవ్ నగర్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కాలనీకి చెందిన ఇద్దరు చిన్నారులు నీటి కుంటలో పడి మృత్యువాత పడ్డారు. సోమవారం పాఠశాలకు సెలవు రోజు కావడంతో సంజయ్(9), లోకేష్(9) అనే ఇద్దరు విద్యార్థులు మరో ఇద్దరితో కలిసి ఈతకు వెళ్లారు. దగ్గరలోనున్న నీటి కుంటలో స్నానానికి దిగి, బురదలో కూరుకుపోయారు. గట్టుపైన ఉన్న మరో ఇద్దరు పరుగెత్తుకెళ్లి, పెద్దలకు విషయం చేరవేసే సరికి ఆ ఇద్దరు చిన్నారులు నీటిలో మునిగి చనిపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న వారి తల్లిదండ్రులు బోరున విలపించారు. జమ్మలమడుగు డిఎస్పీ నాగరాజు అక్కడికి చేరుకుని పరిస్థిని సమీక్షించారు.

ఇదీ చదవండి :

బస్సు కిందపడి వాహనదారుడు మృతి

Intro:slug: AP_CDP_37_09_IDDARU_STUDENTS_MRUTHI_AV_AP10039
contributor: arif, jmd
ఇద్దరు చిన్నారుల ను మింగిన నీటి కుంట
( ) కడప జిల్లా జమ్మలమడుగు మండలం గుడం చెరువు సమీపంలోని రాజీవ్ నగర్ కాలనీ లో విషాదం చోటుచేసుకుంది .ఒకే కాలనీకి చెందిన ఇద్దరు చిన్నారులు నీటి కుంటలో పడి మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఆ తల్లిదండ్రులకు ఒక్కరే కుమారులు కావడం గమనార్హం .వివరాల్లోకి వెళితే సోమవారం పాఠశాలలకు సెలవులు వదిలారు .రాజీవ్ నగర్ కాలనీకి చెందిన సంజయ్(9), లోకేష్(9) అనే ఇద్దరు విద్యార్థులు మరో ఇద్దరితో కలిసి ఈత కోసం వెళ్లారు. కొద్దిదూరంలో వారికి ఒక నీటి కుంట కనబడింది .నీటి కుంట సుమారు 20 అడుగుల లోతులో ఉన్న విషయం తెలియదు. ఈ విషయం తెలియక ముందుగా లోకేష్ ,సంజయ్ దిగారు. లోతు ఎక్కువగా ఉండడంతో బురదలో కూరుకుపోయారు. గట్టు పైన ఉన్న మరో ఇద్దరు పరుగెత్తుకు వెళ్ళి తమ పెద్దలకు విషయం తెలియజేశారు .వారు వచ్చే లోగా పాపం ఆ ఇద్దరు చిన్నారులు నీటిలో మునిగి చనిపోయారు .సంఘటనా స్థలానికి వారి తల్లిదండ్రులు చేరుకొని బోరున విలపించారు. ఆ సన్నివేశం చూసి పలువురు కంటతడి పెట్టారు. జమ్మలమడుగు డిఎస్పీ నాగరాజు పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలపై ఆరా తీశారు. స్పాట్

Body:చిన్నారులను మింగిన నీటి కుంట

Conclusion:ఇద్దరు చిన్నారులు మింగిన నీటి కుంట
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.