పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం కొంగువారిగూడెం పరిధిలో ఉన్న ఎర్రకాలువ జలాశయం కింద సుమారు 36 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. జంగారెడ్డిగూడెం మండలంలోని 22 గ్రామాలకు, రెండు పంటలకు సరిపడా నీరు అందుతుంది. కామవరపుకోట, ద్వారకాతిరుమల, నల్లజర్ల, తాడేపల్లిగూడెం మండలాలకూ, కుడి ఎడమ కాలువల ద్వారా నీరు చేరుతుంది. ఇంతటి ప్రాధాన్యత ఉన్న జలాశయం, నేడు మరమ్మతులతో దర్శనమిస్తోంది. ప్రాజెక్టు అభివృద్ధికి పదేళ్లుగా నిధులు సైతం మంజూరు కాకపోవడం వల్ల, పరిస్థితి మరింత అధ్వానంగా మారింది.
2018 వరదల సమయంలో జలాశయం గేట్లు తెరుచుకోకపోవడం వల్ల, అధికారులు దిగువనున్న గ్రామాలను ఖాళీ చేయించారు. చివరి క్షణంలో గేట్లు తెరుచుకోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈసారీ అదే పరిస్థితి తలెత్తడంతో స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కరకట్టపై వృక్షాలు పెరగడం వల్ల కరకట్ట బలహీనపడే ప్రమాదం ఉందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. రక్షణ గోడకు గండి పడి మూడేళ్లు కావస్తున్నా నేటికీ మరమ్మతులు చేయడం లేదని మండిపడుతున్నారు.
అధికారులు మరమ్మతులు చేపట్టకపోతే, ఏ సమయంలో ఎలాంటి ప్రమాదం ముంచెత్తుతుందోనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి : తితిదే ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ బదిలీ