ETV Bharat / state

జంగారెడ్డిగూడెం వైకాపాలో వర్గపోరు..17మంది కౌన్సిలర్లతో అజ్ఞాతంలోకి ఎమ్మెల్యే! - జంగారెడ్డిగూడెం వైకాపాలో వర్గపోరు తాజా వార్తలు

మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన వేళ...పశ్చిమగోదావరి జిల్లాలో జంగారెడ్డిగూడెం వైకాపాలో క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. 17 మంది కౌన్సిలర్లతో కలిసి..చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. స్థానిక వైకాపా ఎమ్మెల్యే ఎలిజా, ఎంపీ కోటగిరి శ్రీధర్​ల మధ్య విభేదాల కారణంగా కౌన్సిలర్లు రెండు వర్గాలుగా చీలిపోయారు.

జంగారెడ్డిగూడెం వైకాపాలో వర్గపోరు
జంగారెడ్డిగూడెం వైకాపాలో వర్గపోరు
author img

By

Published : Mar 15, 2021, 6:04 PM IST

పశ్చిమగోదావరి జిల్లాలో జంగారెడ్డిగూడెం వైకాపాలో క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. మున్సిపాలిటీలోని 29 వార్డుల్లో 25 స్థానాలను వైకాపా గెలుచుకోగా...ఛైర్మన్ ఎంపికలో ఎమ్యెల్యే ఎలీజా, ఎంపీ కోటగిరి వర్గాల మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు పొడిచూపాయి. తాము బలపరిచిన వ్యక్తికే ఛైర్మన్ పదివిని కట్టబెట్టాలని ఇరుపక్షాల నాయకులు తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఎమ్యెల్యే ఎలీజా వర్గం ఒక అడుగు ముందుకేసి..17 మంది కౌన్సిలర్లతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

కుదరని సయోధ్య

ఆదివారం రాత్రి వరకు చెరో రెండున్నర ఏళ్లు ఛైర్మన్ పదవిలో ఉండాలని ఇరువర్గాల నేతలు ఒప్పందం చేసుకొన్నారు. ఈ ఒప్పందాన్ని ఎమ్యెల్యే వర్గం వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. అధిక మంది కౌన్సిలర్లు ఎమ్యెల్యే వర్గంలో ఉండటంతో అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. 16వ వార్డులో గెలుపొందిన కాసర తులసిని ఎమ్మెల్యే వర్గం బలపరుస్తోంది. 18వ వార్డులో విజయం సాధించిన మేడవరపు లక్ష్మీ జ్యోతిని ఛైర్మన్ చేయాలని ఎంపీ వర్గం పట్టుపట్టింది. ఎంపీ కోటగిరి శ్రీధర్​కు మేడవరపు లక్ష్మీజ్యోతి సమీప బంధువు కావడం గమనార్హం.

మరోసారి తేటతెల్లమైన విభేదాలు

ఎమ్మెల్యే ఎలీజా, ఎంపీ కోటగిరి శ్రీధర్ మధ్య చాలా కాలంగా వర్గపోరు కొనసాగుతుంది. చింతలపూడి నియోజవర్గంలో కోటిగిరి కుటుంబానికి బలమైన పట్టుంది. ఈ కారణంతోనే ఎంపీ నియోజకవర్గ రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్నారు. తన అసెంబ్లీ పరిధిలో ఎంపీ పెత్తనం చేయటం ఎమ్యెల్యేకు మింగుడుపడటం లేదు. ఈ కారణంతోనే ఇద్దరి మధ్య గ్రూపు రాజకీయాలు ప్రారంభమయ్యాయి. నియోజవర్గంలో ఎంపీ, ఎమ్యెల్యే వర్గాలుగా నాయకులు, కార్యకర్తలు సైతం విడిపోయారు. వార్డు స్థానాల అభ్యర్థుల ఎంపికలోనూ ఇద్దరి మధ్య వర్గపోరు ప్రస్ఫుటమైంది. జిల్లా మంత్రులు కలగజేసుకొని ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదిర్చారు. ప్రస్తుతం జంగారెడ్డిగూడెం మున్సిపల్ ఛైర్మన్ గిరిని ఏ వర్గం దక్కించుకుంటుందో వేచి చూడాలి.

ఇదీచదవండి

నాడు వార్డు వాలంటీర్​..నేడు ఛైర్‌పర్సన్‌ !

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.