తెలుగుభాష సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జిల్లా అధికారులను కలిసారు. తెలుగులో ఉత్తర ప్రత్యుత్తరాలు నిర్వహించాలని అధికారులకు వినతిపత్రం సమర్పించారు. అధికార భాషగా తెలుగు ఉన్నా ప్రభుత్వ కార్యాలయాల్లో పాలన ఆంగ్లభాషలో జరుగుతోందని తెలిపారు. ఇది తెలుగుభాష ఉనికికీ ప్రమాదాన్ని తెస్తోందని.. మాతృ భాషను కాపాడుకోవల్సిన బాధ్యత అందరీ పై ఉందని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: 'తెలుగు విశ్వవిద్యాలయాన్ని రాష్ట్రానికి తీసుకొస్తాం'