ETV Bharat / state

ప్రతిపక్షాలకు రఘురామపై ఎందుకంత శ్రద్ధ: వైకాపా - AP Politics

ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టుపై ప్రతిపక్షాలు స్పందించడాన్ని అధికార వైకాపా తప్పుబట్టింది. తెదేపాకు రఘురామపై ఎందుకంత శ్రద్ధ అని వైకాపా నేతలు ప్రశ్నించారు. ఎంపీ అరెస్టు విషయంలో చట్టం తన పని తాను చేస్తుందని స్పష్టం చేశారు. ఎంపీగా గెలిపించిన ప్రజలను ఆయన గాలికొదిలేశారని ధ్వజమెత్తారు.

వైకాపా
వైకాపా
author img

By

Published : May 15, 2021, 5:56 PM IST

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని.. గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగ‌నాథ‌రాజు వ్యాఖ్యానించారు. ఈ సమయంలో ఎంపీని అరెస్టు చేయడం ఏంటని ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్న తీరు సరికాదని.. అసలు ప్రతిపక్ష పార్టీలకు ఎందుకు రఘురామకృష్ణరాజుపై అంత ప్రత్యేక శ్రద్ధ అని మంత్రి నిలదీశారు. 14 నెలలు నుంచి ఎంపీ దిల్లీలో కూర్చుని తనను గెలిపించిన ప్రజలను గాలి కొదిలేశారనా? అని ప్రశ్నించారు. కనీసం వారి బాగోగులు పట్టించుకున్న పాపాన పోలేదని ఆరోపించారు.

పశ్చిమగోదావరి అంటే ప్రశాంతంగా ఉన్న జిల్లా అని.. అంతా సిగ్గుపడేలా ప్రవర్తిస్తున్న ఎంపీపై తాను సైతం కేసు పెట్టానని మంత్రి చెరుకువాడ స్పష్టం చేశారు. ప్రజల మనోభావాలు, ఆచారాలు రఘురామకృష్ణరాజుకు అవసరం లేదన్నారు. ఇప్పటికే ఆ ఎంపీ మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందని.. కానీ ఇంతకాలం ఉపేక్షించిందని.. నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్ రాజు అన్నారు. కొన్ని వర్గాలపై రఘురామకృష్ణరాజు విద్వేషపూర్వక వ్యాఖ్యలు చేస్తున్నారని.. ప్రభుత్వంలోని వివిధ హోదాల్లో ఉన్నవారిని లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేసి, ప్రభుత్వ వ్యవస్థల పట్ల ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లేలా చేయడానికి ఆయన ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

చంద్రబాబు దర్శకత్వంలోనే రఘురామకృష్ణరాజు, పవన్​కల్యాణ్ వ్యాఖ్యలు ఉన్నాయని.. కుట్ర వెనుక భాగస్వాములైన వారినీ అరెస్ట్ చేయాలని.. భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. కులాల మ‌ధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం, మీద ద్వేష భావాన్ని పెంచ‌డానికి ర‌ఘురామ‌కృష్ణరాజు ప్రయ‌త్నించారని.. కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి ఆరోపించారు. రాజ్యాంగ వ్యతిరేక కార్యక‌లాపాల‌కు, రాజ‌ద్రోహ చర్యలకు పాల్పడుతూ.. పార్టీ అధినేతను కించ‌ప‌రిచే ప్రయ‌త్నాలు చేస్తున్నారని.. అందుకే అతన్ని అరెస్టు చేశారన్నారు. రఘురామ‌కృష్ణరాజు అరెస్టులో ప్రభుత్వానికి, వైకాపాకి ఎలాంటి సంబంధం లేదని ఆయన పేర్కొన్నారు.

ఇదీ చదవండీ... కింద కోర్టుకు వెళ్లాలని రఘురామకు.. హైకోర్టు సూచన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.