పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో పోలీసులు పురపాలక అధికారులు ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేశారు. మాస్కులు లేకుండా రహదారులపై తిరుగుతున్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్వారంటైన్ కు తరలించారు.
80 రోజులుగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా... నేటికీ కొందరు మాస్కులు లేకుండా బయటకు వస్తున్నారని పురపాలక కమిషనర్ శ్రావణ్ కుమార్ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వీరందరిని 14రోజులపాటు క్వారంటైన్ కు పంపుతున్నామన్నారు.