జిల్లాలోని పింఛనుదారులకు అక్టోబరు నెలకు ఇవ్వలవలసిన పింఛన్‌ను వాలంటీర్లు వారి ఇళ్ల వద్దకు వెళ్లి అందజేశారు. జియో ట్యాగింగ్ ద్వారా లబ్దిదారులకు పింఛన్లను పంపిణీ చేశారు. గత నెల సర్వర్లు మొరాయించడం వల్ల ఆలస్యమైందని... కాని ఈ సారి అటువంటి ఇబ్బందులు లేని కారణంగా లబ్దిదారులకు త్వరితగతిన పంపిణీ చేశామని వాలంటీర్లు తెలిపారు. జిల్లాలో 4,97,700 మంది పింఛనుదారులు ఉన్నారు. వీరికి పంపిణీ చేసేందుకు ప్రభుత్వం 121 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది.
ఇదీ చదవండి: