ఇవీ చూడండి.
తెదేపా భారీ జెండాతో మహిళల ర్యాలీ - palakollu
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో తెలుగుదేశం పార్టీ భారీ జెండాతో మహిళలు ర్యాలీ చేశారు. అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన తెదేపా ప్రభుత్వానికి మరోసారి అండగా ఉంటామని తెలిపారు.
పాలకొల్లులో భారీ తెదేపా జెండాతో మహిళలు ర్యాలీ చేశారు.
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. పేదలకు ఇళ్లుకట్టించి ఒక్కొక్కరికి 5లక్షల వరకూ లబ్ది చేకూర్చారని మహిళలు కొనియాడారు. ప్రజాసంక్షేమానికి పాటుపడుతున్న చంద్రబాబుకు పట్టం కట్టాలని నరసాపురం ఎంపీ అభ్యర్థి శివరామరాజు కోరారు. ఎవరెన్ని మాయమాటలు చెప్పినా ఈ సారి ఘనవిజయం తెదేపాదేనని దీమా వ్యక్తం చేశారు. అనంతరం తెదేపాభారీ జెండాతో మహిళలు ర్యాలీ చేశారు.
ఇవీ చూడండి.
sample description