పశ్చిమగోదావరి జిల్లాలో కొత్తగా 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పెరవలి మండలం ఎన్వీ పాలెంలో ఇవి వెలుగుచూశాయి. కోయంబేడుకు వెళ్లి వచ్చిన డ్రైవర్‌కు, అతని భార్యకు వైరస్ సోకింది. దీంతో జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 72కు చేరింది.
ఇందులో 52మంది డిశ్చార్జ్ కాగా.. 20 మంది ఏలూరు కొవిడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నరసాపురం, ఏలూరు ఆర్.ఆర్. పేట, వైఎస్ఆర్ కాలనీల్లో 28 రోజులుగా కొత్త కేసులు నమోదు కానందున.. వాటిని రెడ్ జోన్ నుంచి తొలగించారు.
ఇవీ చదవండి.. చెప్పినా వినకుండా బాల్యవివాహం చేశారు..దీంతో..!