పోలవరం వద్ద గోదావరి పరవళ్లుతొక్కుతోంది. స్పిల్ వే వద్ద 32. 8 మీటర్ల నీటి మట్టం నమోదైంది. కాపర్ డ్యాం వద్ద 34. 3. మీటర్లు నమోదైంది. స్పిల్ వే 48గేట్ల ద్వారా వరద నీరు విడుదల చేశారు. గోదావరికి భారీస్థాయిలో వరద రావడంతో పోలవరం, వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లోని 45గ్రామాల్లో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యావసరాలు, ఇతర అవసరాల కోసం ప్రజలు బోట్ల ద్వారా గ్రామాలకు రాకపోకలు సాగించారు. ఆయా మండలాల్లోను అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. నిత్యావసరాలు, కూరగాయలు, బియ్యం, గ్యాస్ బండలు, వంటివి బోట్ల ద్వారా అందజేశారు.
ఇదీ చదవండీ.. Ramappa Temple: రామప్ప దేవాలయానికి అంతర్జాతీయ గుర్తింపు