సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని కొత్త ఆలోచనలు, మార్గాలు వెతకాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జరిగిన నిట్ స్నాతకోత్సవంలో... గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో కలసి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులకు పలు సూచనలు చేశారు. అందరికీ స్పూర్తినిచ్చేలా మనల్ని మనం మలచుకోవాలని ఉపరాష్ట్రపతి చెప్పారు. వ్యవసాయంపై అందరూ దృష్టిపెట్టాలని... మేథాశక్తితో భావి ఇంజినీర్లు దేశాభివృద్ధికి పాటుపడాలని సూచించారు.
ఆహార ఉత్పత్తిని మరింత పెంచాల్సిన అవసరం ఉందన్న ఉపరాష్ట్రపతి... పరిశ్రమలతోపాటు పరిశుభ్రమైన వాతావరణం అవసరమని అభిప్రాయపడ్డారు. దేశం మూడో ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని వెంకయ్యనాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. మురికివాడలకు ప్రత్యామ్నాయం సూచిస్తే... ఆ ప్రాంతవాసుల ఆలోచనలో మార్పు వస్తుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి