పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లి సరిహ్దదు చెక్ పోస్టు వద్ద భారీగా వాహనాలు బారులు తీరాయి. తెలంగాణ, ఇతర రాష్ట్రాల నుంచి వలస కూలీలను తరలిస్తున్న వాహనాలు, అత్యవసర పనులపై వెళ్తున్న వారి వాహనాలు భారీ సంఖ్యలో రహదారులపై నిలిచిపోయాయి.
వారి వద్ద అనుమతి పత్రాలు ఉన్నా.. వివరాల నమోదు ఆలస్యం అవుతున్నందున పడిగాపులు పడక తప్పడంలేదు. తెల్లవారుజాము నుంచి నిరీక్షిస్తున్నామని.. కనీసం మంచినీరు దొరక్క అవస్థలు పడుతున్నామని వాహనదారులు తెలిపారు. త్వరగా ప్రక్రియ ముగించి తమను పంపించాలని అధికారులను కోరుతున్నారు.
ఇవీ చదవండి: