ETV Bharat / state

హత్యకు గురైన బాలిక కుటుంబీకులకు వాసిరెడ్డి పద్మ పరామర్శ - మైనర్ బాలిక హత్య

పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలంలోని తోచలకరాయుడి పాలెంలో ఈనెల 14న హత్యకు గురైన బాలిక అంజలి తల్లిదండ్రులను మహిళా కమిషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. ఈ విషయంపై జిల్లా అధికారులతో కలెక్టర్, ఎస్పీ, ఇతర జిల్లా ఉన్నతాధికారులతో ఫోక్సో, దిశ చట్టాల పనితీరుపై ఆమె సమీక్ష నిర్వహించారు.

మైనర్ బాలిక అంజలి కుటుంబీకులకు వాసిరెడ్డి పద్మ పరామర్శ

author img

By

Published : Nov 1, 2020, 5:21 AM IST

పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలంలోని తోచలక రాయుడి పాలెంలో బాలిక కుటుంబ సభ్యులను మహిళా కమిషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్, ఎస్పీ, ఇతర జిల్లా ఉన్నతాధికారులతో కలిసి ఫోక్సో, దిశ చట్టాలపై పద్మ సమీక్షించారు.

రూ.25 వేలు అందజేత..

ఈ క్రమంలో బాలిక తల్లిదండ్రులకు ప్రభుత్వం తరఫున 25 వేల రూపాయల చెక్కును అందజేశారు. బాలిక హత్య విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లి కుటుంబ సభ్యులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలియజేశారు.

ఎవరూ ఆందోళన చెందవద్దు..

రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా సమగ్ర దర్యాప్తు జరిపి నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ అంశంపై ఎలాంటి ఆందోళన చెందవద్దని.. ఈ కేసు ఫోక్సో చట్టం ప్రకారం నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.